Raksha Bandhan Thali Items: రాఖీ ఎప్పుడు కట్టాలి? రాఖీ కట్టే విధానం గురించి తెలుసుకోండి

Raksha Bandhan 2022: సోదర సోదరీమణుల నిస్వార్థ ప్రేమకు నిదర్శనం రాఖీ పండుగ. అయితే ఈ రాఖీ కట్టే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 14, 2022, 07:33 PM IST
  • ఆగస్టు 11న రాఖీ పండుగ
  • రాఖీ ఏ సమయంలో కట్టాలో తెలుసుకోండి
Raksha Bandhan Thali Items: రాఖీ ఎప్పుడు కట్టాలి? రాఖీ కట్టే విధానం గురించి తెలుసుకోండి

Raksha Bandhan 2022: సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీక రాఖీ పండుగ. ఈ సారి రక్షా బంధన్ ఆగస్టు 11, 2022న (Raksha Bandhan 2022) వస్తుంది. సోదరుడు దీర్ఘాయువుతో ఉండాలని  కోరుకుంటూ సోదరి రాఖీ కడుతుంది. ఈ రోజున సోదరిని జీవితాంతం రక్షిస్తానని సోదరుడు వాగ్దానం చేస్తాడు. రాఖీ పౌర్ణమి రోజున పళ్లెన్ని అలంకరించి.. ఆ ప్లేట్లో  రాఖీతోపాటు పూజా సామాగ్రిని ఉంచుతారు. అయితే రాఖీ ప్లేట్ లో ఏయే వస్తువులు ఉంచుతారో తెలుసుకుందాం.  

రాఖీ కట్టడానికి శుభ ముహూర్తం 
ఈసారి పౌర్ణమి తిథి 11, 12 రెండు రోజులలో వస్తోంది. ఈ నేపథ్యంలో రక్షాబంధన్‌ను ఏ రోజు జరుపుకోవాలో విషయంపై ప్రజలకు క్లారిటీ లేదు. అయితే పంచాంగం ప్రకారం, శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి ఆగస్టు 11 ఉదయం 10.38 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 12 ఉదయం 7.05 గంటలకు ముగుస్తుంది. 

రాఖీ ప్లేట్‌లో ఉండే వస్తువులు..
రాఖీ
రక్షణ దారాన్ని రాఖీ ప్లేట్‌లో ఉంచండి. సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టడం దుష్ట శక్తులను నాశనం చేస్తుందని నమ్ముతారు. 
కుంకుమ
రక్షాబంధన్ పళ్ళెంలో కుంకుమ ఉంచుతారు. దీనిని సోదరుడికి పెడితే గ్రహదోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.
అక్షింతలు
మీ సోదరుడి తలపై అక్షింతలు వేయడం వల్ల వారి జీవితం ఆనందంతో నిండిపోతుంది. అంతేకాకుండా ప్రతికూల శక్తులు ప్రభావం కూడా తొలగిపోతుంది. 
హారతి
రక్షాబంధన్ శుభ సందర్భంగా సోదరీమణులు దీపం వెలిగించి, వారి సోదరుడికి హారతి చేస్తారు. దీంతో వారి ఇద్దరి మధ్య బంధం ఎప్పటికీ అలానే నిలిచి ఉంటుంది. 
స్వీట్
స్వీట్లు లేకుండా రాఖీ ప్లేట్ అసంపూర్ణంగా ఉంటుంది. ఈ రోజున సోదరుడి నోటిని తీపి చేయడం వల్ల వాటి మధ్య బంధం ఇంకా గట్టి పడుతుంది.
రుమాలు
హిందూ మతంలో రాఖీ కట్టేటప్పుడు, సోదరుడి తలను గుడ్డతో కప్పుతారు. కాబట్టి రుమాలు కూడా ఉంచండి.

Also Read: Ekmukhi Rudraksha: ఏకముఖి రుద్రాక్ష ప్రయోజనాలు, రుద్రాక్ష అసలైందా..నకిలీదా ఎలా గుర్తించడం

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News