Raksha Bandhan 2022: మీ సోదరుడు దీర్ఘాయుష్షుతో ఉండాలంటే.. ఈ ముహూర్తంలో రాఖీ కట్టండి!

Raksha Bandhan 2022: సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు ప్రతీక రాఖీ పండుగ. ఈ ఏడాది రక్షాబంధన్ ఆగస్టు 11న వచ్చింది. దీని యెుక్క విశిష్టత గురించి తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 21, 2022, 01:14 PM IST
Raksha Bandhan 2022: మీ సోదరుడు దీర్ఘాయుష్షుతో ఉండాలంటే.. ఈ ముహూర్తంలో రాఖీ కట్టండి!

Raksha Bandhan 2022: సోదర సోదరీమణుల బంధానికి ప్రతీక రాఖీ పండుగ. దీర్ఘాయువుతో జీవించాలని సోదరుడికి సోదరి రాఖీ కడితే... తనకు జీవితాంతం రక్షణగా ఉంటానని సోదరుడి బహుమతి ఇస్తాడు. ఈ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది రక్షాబంధన్ ను 11 ఆగస్టు 2022న శ్రావణ శుక్ల చతుర్దశి-పూర్ణిమ రోజున జరుపుకోనున్నారు. విశేషమేమిటంటే ఈ ఏడాది ప్రదోష కాలంలో సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టనున్నారు. 

శుభ ముహూర్తం
పంచాంగం ప్రకారం, ఆగస్ట్ 11 గురువారం ఉదయం 10:39 నుండి పౌర్ణమి ప్రారంభమై... ఆగష్టు 12 ఉదయం 7:06 వరకు ఉంటుంది. ఆగస్టు 12న తక్కువ సమయం ఉన్నందున, రక్షాబంధన్ పండుగను ఆగస్టు 11న జరుపుకుంటున్నారు. అంతేకాకుండా ప్రదోష కాలంలో రాఖీ కట్టనున్నారు. అయితే ఈ రాఖీ పండు రోజు భద్ర ముహూర్తం ఆగస్టు 11 ఉదయం 10:39 నుండి రాత్రి 8:52 వరకు ఉంటుంది. ఈ సమయంలో రాఖీ కట్టరు. కాబట్టి సోదరీమణులు ఆగస్టు 11 రాత్రి 8:52 గంటల తర్వాత సోదరులకు రాఖీ కట్టవచ్చు. రాత్రి 8:53 నుండి 9:15 మధ్యలో రాఖీ కట్టడానికి ఉత్తమ సమయం.

భద్రలో రాఖీ ఎందుకు కట్టరు?
హిందూమతం ప్రకారం, భద్ర ముహూర్తంలో ఏ శుభకార్యం చేయరు. ఎందుకంటే ఇది మంచిదిగా పరిగణించరు. అందుకే భద్ర ముహూర్తంలో రాఖీ కట్టడం నిషిద్ధం. భద్ర ముహూర్తంలోనే రావణుడికి అతడి సోదరి రాఖీ కట్టడం వల్ల లంకాధిపతి నాశనమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. 

Also Read: Sravana Shivratri 2022: సంతానం కలగాలంటే.. శ్రావణ శివరాత్రి రోజున శివుడిని ఇలా పూజించండి! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News