Rahu Transit 2023: మీనరాశిలో సంచరించబోతున్న రాహువు.. ఈ 3 రాశుల వారికి అదృష్టం, ఐశ్వర్యం..

Rahu Transit 2023: క్రూరుడైన రాహువు త్వరలో మీనరాశి ప్రవేశం చేయనున్నాడు. ప్రస్తుతం ఈ దుష్ట గ్రహం మేషరాశిలో సంచరిస్తుంది. మీనరాశిలో రాహు సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 8, 2023, 07:24 AM IST
Rahu Transit 2023: మీనరాశిలో సంచరించబోతున్న రాహువు.. ఈ 3 రాశుల వారికి అదృష్టం, ఐశ్వర్యం..

Rahu Gochar 2023 effect: జ్యోతిష్యశాస్త్రంలో రాహువును ఛాయా గ్రహం, దుష్ట గ్రహం, అంతుచిక్కని గ్రహంగా పిలుస్తారు. ఎవరి జాతకంలో రాహువు బలహీన స్థితిలో ఉంటాడో వారు అనేక కష్టాలను, నష్టాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఏ వ్యక్తి కుండలిలో రాహువు బలంగా ఉంటాడో వారు కెరీర్ లో ఉన్నతస్థాయికి చేరుకుంటారు. పాలిటిక్స్ లో మంచి పేరు సంపాదిస్తారు.  రాహు గ్రహం అక్టోబరు 30న మీనరాశిలోకి ప్రవేశించబోతుంది. ఇతడి సంచారం కారణంగా మూడు రాశులవారు మంచి లాభాలను పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.

తులారాశి
ఈరాశి యెుక్క ఆరో ఇంట్లో రాహు సంచారం జరగబోతుంది. దీంతో మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్‌తో పాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 
కర్కాటకం
రాహు సంచారంతో కర్కాటక రాశి వారికి అదృష్టం పడుతుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు ఏదైనా విలువైనది కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. 

Also Read: Mercury transit 2023: వృషభరాశిలో ఏర్పడబోతున్న బుధాదిత్య రాజయోగం.. జూన్ 15 వరకు ఈ రాశులపై కనక వర్షం...

వృషభం
రాహు గ్రహ సంచారం వృషభరాశి వారికి ఊహించని ధనాన్ని ఇస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. మీ కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీరు బెట్టింగ్, లాటరీ లేదా షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలను గడిస్తారు. 

Also Read: Sun transit 2023: జూన్ 15న కీలక పరిణామం.. ఇక ఈ రాశులవారు పట్టిందల్లా బంగారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News