Rahu Transit In 2023: రాహువును జ్యోతిష్య శాస్త్రంలో అశుభ గ్రహాంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ గ్రహం వ్యక్తుల రాశుల్లో శుభ స్థానంలో లేకపోవడం వల్ల తీవ్ర సమస్యలు వస్తాయి. దీని వల్ల చాలా మందిలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. రాహువు ఎంతకాలం రాశిలో ఉంటే అంతకాల సమస్యలు తప్పవు.. కాబట్టి రాహువు సంచారం చేసే క్రమంలో లేదా మీ రాశి స్థానంలో మార్పులు చేస్తే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే రాహు ఈ సంవత్సరంలో సంచారం చేస్తుంది. కాబట్టి చాలా రాశులవారి జీవితాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో మనం ఇప్పడు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తుల జీవితాల్లో రాహువు మూడవ, ఆరు, పదకొండవ స్థానంలో ఉంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇతర స్థానాల్లో ఉంటే తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాహువు చెడు ప్రభావం కారణంగా చాలా రాశులవారి జీవితాల్లో విభిన్న మార్పులు వస్తాయి.
Also read: Herbal Plant: ఈ ఒక్క మొక్క చాలు కేన్సర్ సహా 5 ప్రాణాంతక వ్యాధులకు చెక్ చెప్పవచ్చు
ప్రస్తుతం రాహు గ్రహం మేషరాశిలో రాహువు సంచార దిశలో ఉన్నాడు. ఈ సంచారం గత సంవత్సరం మార్చి 17 జరిగింది. అప్పటి నుంచి రాహువు ఒకటే రాశిలో ఉన్నాడు. అయితే ఈ సంవత్సరంలో 30 అక్టోబర్ రాహువు సంచారం జరగగబోతోంది. కాబట్టి ఈ సంచార ప్రభావం అన్ని రాశులవారిపై సమానంగా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
2023లో మీన రాశిలోకి రాహువు సంచారం:
రాహు సంచారం జ్యోతిషశాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యమైనది పరిగణిస్తారు. ఈ సంచారం కారణంగా మేషం, వృషభం రాశులవారితో పాటు..కర్కాటకం, సింహం, కన్యతో సహా మొత్తం 12 రాశులను ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
మీన రాశికి అధిపతి బృహస్పతి అంటే గురువు. రాహువుకు బృహస్పతితో సమాన సంబంధం కలిగి ఉంటుంది. అంటే బృహస్పతితో రాహువుకు ఉన్న సంబంధం వల్ల ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
అక్టోబర్ తర్వాత అన్ని రాశులవారి జీవితాల్లో ఆకస్మికంగా లాభాలు కలుగుతాయి. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి కొన్ని మంచి అవకాశాలు రావచ్చు. ఉద్యోగం లేనివారు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు మంచి ఆఫర్ పొందవచ్చు. విద్యార్థులు మాత్రం పలు ఇబ్బందులు పడతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Also read: Herbal Plant: ఈ ఒక్క మొక్క చాలు కేన్సర్ సహా 5 ప్రాణాంతక వ్యాధులకు చెక్ చెప్పవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook