Rahu Transit Effect On Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో రాహువు మరియు కేతువులను దుష్ట గ్రహాలు అని పిలుస్తారు. ఏడాదిన్నరకు ఒకసారి రాహువు తన రాశిని మారుస్తాడు. గత సంవత్సరం ఏప్రిల్ 12న రాహువు మేషరాశిలోకి ప్రవేశించాడు. మళ్లీ 2023 అక్టోబరు 30న మీనరాశిలో సంచరించనున్నాడు. సాధారణంగా రాహు సంచారం ఇబ్బందులను కలిగిస్తుంది. కానీ మేషరాశిలో రాహు గోచారం నాలుగు రాశులవారికి శుభ ఫలితాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
సింహరాశి
రాహు సంచారం సింహరాశి వారికి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులు మంచి ప్రయోజనం పొందుతారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీరు ప్రయామం చేసే అవకాశం ఉంది. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రాహువు యొక్క చెడు ప్రభావాలను నివారించడానికి శివలింగంపై జలాభిషేకం చేయండి.
వృశ్చికరాశి
రాహువు వృశ్చిక రాశిలోని ఆరవ ఇంట్లో సంచరిస్తున్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తోపాటు మంచి ప్రమోషన్ కూడా లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.
Also Read: Sun Transit 2023: సూర్యుడి గోచారంతో జూన్ 16 నుంచి ఈ 4 రాశుల జాతకాలకు మహర్దశే
కర్కాటక రాశి
రాహువు మీ రాశి యెుక్క పదో ఇంట్లో కూర్చున్నాడు. దీంతో మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందనున్నారు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. జాబ్ మారాలనుకునే వారికి ఇదే మంచి సమయం. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఐటీతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం బాగుంటుంది. రాహువు యొక్క అశుభ ఫలితాలను నివారించడానికి కుక్కకు పాలు పోయడంతోపాటు రోటీని తినిపించండి.
కుంభ రాశి
రాహువు కుంభ రాశిలో మూడవ ఇంట్లో కూర్చున్నాడు. దీంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇదే మంచి సమయం. మీరు మీ బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
Also Read: Mercury Set 2023: త్వరలో వృషభరాశిలో బుధుడి అస్తమయం.. ఈ 3 రాశులకు కష్టాలు షురూ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook