Rahu Ketu Transit 2023: త్వరలో రాహు-కేతు గమనంలో పెను మార్పు.. ఈ 3 రాశుల జీవితం అల్లకల్లోలం

Rahu Ketu Transit 2023: దుష్ట గ్రహాలైన రాహు-కేతు గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరినీ ప్రభావం చేస్తుంది. అక్టోబరులో ఈ రెండు గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. దీని వల్ల మూడు రాశులవారు ఇబ్బందులను ఎదుర్కోనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2023, 08:34 PM IST
Rahu Ketu Transit 2023: త్వరలో రాహు-కేతు గమనంలో పెను మార్పు.. ఈ 3 రాశుల జీవితం అల్లకల్లోలం

Rahu Ketu Transit 2023: ఆస్ట్రాలజీలో రాహు, కేతువులను ఛాయా గ్రహాలు, దుష్ట గ్రహాలు అని పిలుస్తారు. ఈ రెండు గ్రహాలు ప్రతి ఒక్కరి జీవితంపై చెడు ప్రభావాన్నే చూపుతాయని ప్రజల విశ్వాసం. అయితే కొన్నిసార్లు శుభ ప్రభావాలను కూడా చూపుతాయి. రాహు-కేతు గమనంలో చిన్న మార్పు కూడా మెుత్తం 12 రాశులవారిపై ఎఫెక్ట్ పడుతుంది. అక్టోబరు 30న రాహువు కేతువు సంచారం జరగనుంది. ఇది ముఖ్యంగా మూడు రాశులవారికి ప్రతికూలంగా ఉండనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

రాహు-కేతు సంచారం ఈ రాశులకు కష్టకాలం

మేషం:

రాహు-కేతు గోచారం వల్ల మేష రాశి వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగ, వ్యాపారాలలో నష్టాలుంటాయి. కుటుంబంలో విభేదాలు తలెత్తుతాయి. పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అనుకూలం కాదు. మీరు మానసికంగా ఒత్తడికి గురవుతారు. ఊహించని నష్టాలు చవిచూస్తారు. ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. 

వృషభం:

రాహువు మరియు కేతువుల సంచారం వల్ల ఈ రాశి వారు జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంటారు. ఇంట్లో గొడవలు ఉంటాయి. మీరు అనారోగ్యం బారిన పడతారు. ఆర్థిక సమస్యలు ఎదుర్కోంటారు. తోబుట్టువుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి. వైవాహిక మరియు వృత్తి జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయి. 

కన్య:

అక్టోబర్ 30న కేతువు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. దాంతో వీరి జీవితం నరకప్రాయంగా మారుతుంది. ఉద్యోగం మరియు వ్యాపారంలో సమస్యలను ఎదుర్కొంటారు. కుటుంబ సంబంధాలు క్షీణిస్తాయి. రుణం చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉంటాయి. 

(నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించలేదు.)

Also read: Budh Shukra Rahu Yog: మార్చి 31న మేష రాశిలో 3 గ్రహాల కలయిక.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే ఇక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News