Rahu Favourite Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రంలో కీడు గ్రహాలుగా భావించే వాటిల్లో రాహు గ్రహం ఒకటి.. ఈ గ్రహ ప్రభావం జాతకాలపై పడితే వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి అంతే కాకుండా వ్యక్తుల శ్రేయస్సు సంపదపై ప్రత్యేకమైన ప్రభావం పడుతూ ఉంటుంది. మాయా గ్రహంగా పిలువబడే రాహు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తే కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. శని గ్రహం లాగే రాహు గ్రహం పేరు వినగానే అందరూ ఎంతో గుబులు చెందుతూ ఉంటారు. నిజానికి జాతకంలో రాహువు శుభ స్థానంలో ఉంటే ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అలాగే సులభంగా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాహు గ్రహం కొన్ని అరుదైన రాశులను ఇష్టపడితే ఉంటుంది. రాహు గ్రహం ఈ రాశుల వారికి ఎల్లప్పుడూ అద్భుతమైన విజయాల అందించడమే కాకుండా అదృష్టాన్ని పెంచుతుంది. అయితే ఈ ఈ గ్రహానికి అత్యంత ప్రీతికరమైన రాశులేవో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాహు గ్రహం అశుభ స్థానంలో ఉన్నవారు తప్పకుండా రెమెడీస్ పాటిస్తూ ఉంటారు. అంతేకాకుండా శని లేదా మంగళవారాల్లో నవగ్రహాలను దర్శిస్తూ ఉంటారు. నిజానికి రాహు గ్రహం అశుభ స్థానంలో ఉన్నవారు తప్పకుండా రెమిడీస్ పాటించడం ఎంతో మంచిది.. అలాగే దానధర్మ కార్యక్రమాలు చేయడం వల్ల కూడా రాహు గ్రహం జాతకంలో అనుకూలంగా మారుతుందట. ఈ గ్రహానికి కొన్ని రాశులు అంటే ఎంతో ప్రీతికరం.. ఆ రాశుల వారిపై ఎప్పుడు రాహువు కరుణాకటాక్షాలు చూపుతూ ఉంటాడు.
వృశ్చిక రాశి :
రాహు గ్రహానికి అత్యంత ప్రీతికరమైన రాశుల్లో వృశ్చిక రాశి ఒకటి.. ఏది ఏమైనా ఈ రాశి వారికి రాహు ఎల్లప్పుడూ అనుగ్రహం చూపుతాడు. రాహు అనుగ్రహం వల్ల వ్యాపారాలు చేసే వృశ్చిక రాశి వారు ఎల్లప్పుడూ లాభపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఉద్యోగాల్లో పురోగతి కూడా లభిస్తుంది. గతంలో నుంచి వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే రాహు గ్రహ అనుగ్రహం కారణంగా కెరీర్లో ఒక్కసారి ఊహించని మార్పులు వచ్చి.. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అలాగే వీరికి ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా కుటుంబ జీవితం పరంగా వీరు ఎల్లప్పుడు ఎంతో ఆనందంగా ఉంటారు. అలాగే వీరికి కీర్తి ప్రతిష్టలు కూడా ఒక్కసారిగా పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ రాశిలో జన్మించిన పిల్లలకు అద్భుతమైన పరిజ్ఞానం లభిస్తాయి. దీనికి కారణంగా తల్లిదండ్రులు ఎప్పుడు శుభవార్తలు వింటూనే ఉంటారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
సింహరాశి :
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు గ్రహం సింహ రాశిలో సంచార దశలో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారికి ఎంత మేలు జరుగుతుందో.. అంతకంటే ఎక్కువ మేలు సింహరాశి వారికి జరుగుతుంది. రాశి వారు ఆకస్మిక ధన లాభాలు పొందుతూ ఉంటారు. అలాగే రాహు గ్రహం అనుగ్రహంతో ఎప్పుడూ డబ్బులు పొందే అదృష్టాన్ని పొందుతారు. దీంతోపాటు గతంలో ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం అయ్యే అద్భుతమైన శక్తిని పొందుతారు. ఇక శత్రువులపై వీరు ఎల్లప్పుడూ విజయాన్ని సాధిస్తారు. సింహరాశి వారి జాతకంలో రాహు ఎల్లప్పుడూ శుభ స్థానంలో విపరీతమైన డబ్బును పొందుతారు. అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.