Pradosha Vratam Effects On Zodiac Signs: శ్రావణ మాసంలో ప్రదోష వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ ఉంది. ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు శివపార్వతులకు ప్రత్యక పూజలు చేసి, ఉపవాపాలు పాటించడం వల్ల కుటుంబంలో ప్రశాంతత లభింస్తుందని భక్తుల నమ్మకం. కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి ప్రతి నెలలో వస్తుంది. అయితే శ్రావణమాసంలో వచ్చే ఇదే తిథి రోజు ప్రదోష వ్రతం చేయడం ఆనవాయితిగా వస్తోంది. ఈ నెలలో త్రయోదశి తిథి సోమవారం ఆగస్టు 28న వచ్చింది. ఈ రోజు ప్రదోష వ్రతం చేయడం శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ వ్రతాన్ని ఈ కింది రాశులవారు ఆచరించడం వల్ల వ్యక్తిగత జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ వ్రతాన్ని ఏయే రాశులవారు పాటిస్తే..మంచి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.
ఈ రాశులవారు తప్పకుండా ప్రదోష వ్రతాన్ని పాటించాలి:
మేషరాశి:
శ్రావణ మాసంలో ప్రదోష వ్రతాన్ని మేషరాశి వారు ఆచరించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ వ్రతాన్ని పాటిస్తే..శత్రువులపై విజయం సాధిస్తారు. అంతేకాకుండా సమాజంలో గౌరం పొందుతారు. ఆర్థికంగా బదపడుతున్న ఈ రాశివారికి ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. వైవాహిక జీవితం గడుపుతున్నవారికి జీవితం ఆనందంగా ఉంటుంది. పదవితో పాటు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి.
మిథునరాశి:
ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఈ రాశివారికి కుటుంబ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగడం కారణంగా ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు. దీంతో పాటు వైవాహిక జీవితం కూడా ఆనందంగా గడుపుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆర్థికంగా బలపడడానికి చాలా రకాల కొత్త మార్గాలు ఏర్పడతాయి.
సింహరాశి:
సింహరాశి ప్రదోష వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు ఉన్న ఈ రాశివారు ప్రదోష వ్రతాన్ని చేయడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు పదవి- ప్రతిష్ట పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ సమయంలో అనుకూలమైనదిగా భావించవచ్చు.
వృశ్చికరాశి:
ప్రదోష వ్రతాన్ని ప్రతి సంవత్సరం ఆచరించడం వల్ల వృశ్చిక రాశివారికి ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. ఉద్యోగాలు చేస్తున్నవారికి జీతాలు పెరగడమే కాకుండా ఊహించని ప్రమోషన్స్ దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపాలు చేవారు తప్పకుండా ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ లాభాలు పొందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి