PM Narendra Modi Horoscope: ప్రధాని నరేంద్రమోదీ జాతకం ఎలా ఉండబోతుంది.. మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టడం గ్యారంటీనా..?

PM Narendra Modi Horoscope: తెలుగు నూతన సంవత్సరాది క్రోధీ నామ సంవత్సరంలో భారత  నరేంద్రమోదీ జాతకం ఎలా ఉండబోతుంది.. ఈయన మూడోసారి ప్రధాని  మంత్రిగా పగ్గాలు చేపట్టం గ్యారంటీనా.. ఇంతకీ జ్యోతిష్య పండితులు ఈయన జాతకం ఈ కొత్త సంత్సరాదిలో ఎలా ఉండబోతుందో  ఓ లుక్కేద్దాం..  

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 9, 2024, 09:31 AM IST
PM Narendra Modi Horoscope: ప్రధాని నరేంద్రమోదీ జాతకం ఎలా ఉండబోతుంది.. మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టడం గ్యారంటీనా..?

PM Narendra Modi Horoscope in Telugu: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. కేవలం మన భారత దేశ రాజకీయాలనే కాదు.. ప్రపంచ రాజకీయాలను సైతం శాసిస్తున్నారు. గల్లీ నుంచి దిల్లీ వరకు.. ఆపై అమెరికా వైట్ హౌస్.. రష్యాలోని క్రెమ్లిన్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇందు గలడు అందు లేడని సందేహము వలదు.. చక్రి
సర్వత్రా ఎలా గలడో.. మోదీ గురించి ప్రస్తావన లేని ప్రపంచమే లేదని చెప్పాలి. ఈ మాటలను ఆయన ప్రత్యర్ధులు సైతం అంగీకరించే నిజం. ముఖ్యంగా మన దేశ రాజకీయాలను నరేంద్ర మోదీ ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాటి నుంచే ప్రభావితం చేస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడు సార్లు విజయం సాధించి 2014లో భారత జనతా పార్టీ నేతృత్త్వంలోని ఎన్డీయే ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ఖరారయ్యారు. ఆ తర్వాత 2014  ఎన్నికల్లో 16వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో భారత ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు.  ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ప్రధాన మంత్రిగా గెలిచారు.  2024 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో మచ్చటగా మూడోసారి ప్రధాన మంత్రిగా అధికార  పగ్గాలు చేపట్టడం ఖాయమని అన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఒకవేళ గెలిస్తే.. వరుసగా మూడుసార్లు ఎన్నికైన కాంగ్రెస్ యేతర ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ రికార్డులకు ఎక్కడం ఖాయం. అంతేకాదు నెహ్రూ, ఇందిరా, మన్మోహన్ సింగ్‌ల తర్వాత దేశాన్ని సుదీర్ఘ కాలం పరిపాలించిన నేతగా ఖ్యాతి గడిస్తారు.

ఇక ఈ క్రోధి నామ సంవత్సరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతకం ఎలా ఉండబోతుంది. మూడోసారి ఈయన ప్రధానిగా పగ్గాలు చేపట్టడం లాంచనమేనా అంటే ఔననే అంటున్నారు జ్యోతిష్య పండితులు. ప్రధాన మంత్రి 17 సెప్టెంబర్ 1950 గుజరాత్‌లోని వాద్ నగర్‌లో జన్మించారు.

ఈయన అనూరాధ నక్షత్రం.. వృశ్చిక రాశి. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించి ధన, కుటుంబ కారకుడైన గురుడు 6, 7వ సంచారం చేయనున్నారు. 6వ స్థానం శత్రు స్థానంలో ఉండటం వలన ఆయన సన్నిహితులు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని విషయాల్లో ప్రజలు.. పార్టీలోని వారు వ్యతిరేకించినా.. చివరకు విజయం సాధిస్తారు. వృశ్చిక రాశి వారి జాతకం విషయానికొస్తే... ప్రధాని నరేంద్ర మోదీది వృశ్చిక రాశి. ఈ రాశి వారు తమ అకుంఠిత అంచచలమైన విశ్వాసంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. అంతేకాదు జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించడం వీరి నైజం. జీవితంలో విజయం సాధించడానికి పూర్తి ప్రాధాన్యత ఇస్తారు.

మరోవైపు రాహువు, కేతువులు 5, 11వ స్థానాల్లో సంచారం వలన చేస్తున్న పనుల్లో విజయం సాధిస్తారు. ముఖ్యంగా కేతువు 11వ ఇంట ఉండటం వలన దైవ బలం చూకూరుతుంది. ఆధ్యాత్మికంగా మానసిక బలం తోడవుతోంది. ఎంత బద్ద శత్రువులైన ఆయన ముందు మాట్లాడలేరు. గురువు 1-5-2024  నుండి 7వ స్థానంలోకి మారడం వలన మోదీకి తిరుగులేని బలం చూకూరబోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

ఆయన మాటకు మరింత విలువ పెరుగుతుంది. అన్నింత విజయం వరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో నెంబర్ వన్ ర్యాంకింగ్‌లో ఉన్న మోదీ ప్రతిష్ఠ ఈ యేడాది మరింత పెరగనుంది. అంతేకాదు మోదీని మరో అత్యున్నత పురస్కారం వరించే అవకాశం ఉంది. 11వ ఇంట కేతువు వలన లోగడ ఒదిలేసిన యూసీసీ, వన్ నేషన్ వన్ ఎలక్షన్, వంటి కీలకమైన చట్టాలను ఆమోదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు ఇప్పటికే దేశ వ్యాప్తంగా ముఖ్యంగా ఈశాన్య భారతంలో సెలా టన్నెల్, అటల్ టన్నెల్ వంటి కీలక కట్టడాలతో పాటు బుల్లెట్ రైల్ కూడా ఈ హయాంలోనే పరుగులు పెట్టడం ఖాయం. ముఖ్యంగా మోదీ గారిని గజకేసరి యోగం, రాజ యోగం, చంద్ర మంగళ యోగం కలిసి ఉండటం మరో విశేషం. మొత్తంగా రాబోయే కాలం కూడా మోదీ వాక్కును వేద వాక్కుగా ప్రజలు ఆదరించడం ఖాయం అని ఆయన జాతకం చెబుతోంది.

Read More: BRS To TRS: బీఆర్ఎస్ పేరును మార్చే ఆలోచనలో ఉన్నాం... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News