Grah Gochar 2023: జనవరిలో 5 గ్రహాల సంచారం... ఈ రాశుల జీవితం కష్టాలమయం.. ఇందులో మీరున్నారా?

Grah Gochar 2023: జనవరి నెలలో గ్రహాల స్థానంలో పెను మార్పు రానుంది. ఇది కొన్ని రాశులవారికి ప్రతికూలంగా పరిణమించనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2023, 09:29 AM IST
Grah Gochar 2023: జనవరిలో 5 గ్రహాల సంచారం... ఈ రాశుల జీవితం కష్టాలమయం.. ఇందులో మీరున్నారా?

Grah Gochar 2023 and its effects: కొత్త సంవత్సరం 2023 ప్రారంభమైంది. గ్రహాల రాశుల్లో కూడా మార్పు మొదలైంది. ఈ నెలలో ప్రధానంగా శనిదేవుడితోపాటు సూర్యభగవానుడు మరియు శుక్రుడు కూడా తమ రాశులను మారుస్తుండగా...  అంగారకుడు మరియు బుధుడు మార్గంలోకి రానున్నారు. శనిదేవుడు జనవరి 17న మకరరాశిని వదిలి కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జనవరి 14న సూర్యభగవానుడు, జనవరి 22న శుక్ర గ్రహాలు మకరరాశిలో సంచరించనున్నారు. ఈనెల 12న కుజుడు, జనవరి 18న బుధుడు ప్రత్యక్ష సంచారంలోకి రానున్నారు. జనవరిలో ఈ గ్రహాల గమనంలో మార్పు కారణంగా కొన్ని రాశులవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

కన్య (Virgo): జనవరిలో ఈ గ్రహాల సంచారం కారణంగా కన్యారాశి వారు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. మీ కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మీరు అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించలేకపోవచ్చు. కెరీర్ లో అడ్డంకులు ఎదురవుతాయి. ఎందులోనైనా పెట్టుబడి పెట్టడం వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది. ప్రతి బుధవారం ఆవుకు పాలకూర తినిపించండి.
కుంభ రాశి (Aquarius): శని గ్రహం యొక్క సాడే సతి యొక్క రెండవ దశ ప్రారంభం కానుంది. దీని వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇతరులతో ఆలోచించి మాట్లాడండి. మీరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి. వృత్తి జీవితంలో అడ్డంకులు ఎదురవుతాయి. ప్రతి శనివారం హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా పఠించండి.
మేషరాశి (Aries): డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు సహచరులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పాత వ్యాధి మిమ్మిల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. చెడు ప్రభావాలను నివారించడానికి ప్రతి మంగళవారం సుందరకాండను పఠించండి.

వృశ్చిక రాశి (Scorpio): ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి నుండి మీరు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగం మారాలనుకునే ఆలోచనను విరమించుకోండి. కుటుంబంలో విభేదాలు తలెత్తుతాయి. గ్రహాలను శాంతింపజేయడానికి ప్రతిరోజూ రాగి నీటితో నింపిన పాత్రలో బెల్లం కలపండి. దీని తరువాత ఉదయం సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి.
కర్కాటక రాశి (Cancer): ఈరాశి వారు వ్యక్తిగత జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. జీవిత భాగస్వామితో సంబంధంలో ఉద్రిక్తత ఉండవచ్చు. మీ ఖర్చులు రెట్టింపు అవుతాయి. మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ఎదుర్కోంటారు. ప్రతి శుక్రవారం తెల్లటి వస్తువులను దానం చేయడం వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. 

Also Read: Shukra Gochar 2023: శనిదేవుడి రాశిలోకి శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా లాభం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U  

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News