Grah Gochar November 2022: ఈ మాసంలో గ్రహాల రాశుల మార్పు వల్ల అనేక యోగాలు ఏర్పడుతున్నాయి. సూర్యుడు, బుధుడు సంచారం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల కొన్ని రాశులవారి అదృష్ట తలుపులు తెరవనున్నాయి. ఆస్ట్రాలజీ ప్రకారం, నవంబరు 13న బుధుడు, 16న సూర్యుడు వృశ్చికరాశిలో ప్రవేశించారు. ఒకే రాశిలో ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా బుధాదిత్య యోగం (Budhaditya Raj Yog) ఏర్పడుతోంది. బుద్ధిని ఇచ్చే బుధుడు, గౌరవాన్ని ఇచ్చే సూర్యుడు వృశ్చికరాశిలో కలవడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరగడంతోపాటు వృత్తిలో విజయాన్ని సాధిస్తారు.
ఈ 3 రాశుల వారికి బుధాదిత్య యోగం చాలా శుభప్రదం
తుల రాశి (Libra): బుధాదిత్య యోగం వల్ల ఈ రాశివారు అపారమైన ప్రయోజనం పొందుతారు. కెరీర్ లో పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. పనిలో అడ్డంకులు ఏర్పడినా సరే మీరు దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
మీనరాశి (Pisces): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాశి వారి జాతకంలో తొమ్మిదవ ఇంట్లో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఏర్పడటం వల్ల ఉద్యోగస్తులకు మేలు జరుగుతుంది. మీకు ప్రమోషన్ రావడంతోపాటు జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
మకరరాశి (Capricorn): బుధాదిత్య యోగం ఏర్పడటం వల్ల ఈ రాశి వారికి మంచి రోజులు రావచ్చు. వ్యాపారం మరియు వృత్తిలో పురోగతికి బలమైన అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో గొప్ప విజయాన్ని పొందే అవకాశం ఉంది. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. భాగస్వామ్యంతో చేసే వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook