Pithori Amavasya 2022: భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను పిథోరి అమావాస్య అంటారు. ఈ సంవత్సరం పిథోరి అమావాస్య (Pithori Amavasya 2022) 27 ఆగస్టు 2022, శనివారం వస్తుంది. ఇది శనివారం రావడంతో దీనిని శని అమావాస్య లేదా శనిశ్చరి అమావాస్య లేదా భాద్రపద అమావాస్య లేదా కుశ గ్రాహిణి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున కుశను సేకరిస్తారు. ఈ అమావాస్య రోజు పూర్వీకులకు స్నానం, దానం, పిండ ప్రదానం చేస్తారు. అంతేకాకుండా ఈ అమావాస్య నాడు దుర్గాదేవిని (Durga devi) ప్రత్యేకంగా పూజిస్తారు. పిథోరి అమావాస్య ముహూర్తం, ప్రాముఖ్యత మరియు పూజా విధానం తెలుసుకుందాం.
శుభ ముహర్తం
ప్రారంభం- 26 ఆగస్టు 2022 మధ్యాహ్నం 12:24 గంటలకు
ముగింపు- 27 ఆగస్టు 2022 మధ్యాహ్నం 01:47 గంటలకు
బ్రహ్మ ముహూర్తం - ఉదయం 04.34- ఉదయం 05.19
అమృత్ కాల్ - సాయంత్రం 05.51 - సాయంత్రం 07.34
పిథోరి అమావాస్య ప్రాముఖ్యత
గ్రంథాల ప్రకారం, పిథోరి అమావాస్య యొక్క గొప్పతనాన్ని మాత పార్వతీ స్వయంగా ఇంద్రాణి దేవికి చెప్పింది. పిథోరి అమావాస్య నాడు ఉపవాసం ఉండటం వల్ల సంతానం లేని దంపతులకు పిల్లలు పుడతారు. వివాహిత స్త్రీలు తమ పిల్లల ఆరోగ్యం, మంచి భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పిథోరి అమావాస్య ఉపవాసం వివాహిత స్త్రీలు మాత్రమే చేయాలనేది మత విశ్వాసం.
పిథోరి అమావాస్య పూజ విధానం
>> ఈ రోజు మహిళలు సూర్యోదయానికి ముందు నీటిలో గంగాజలం కలిపి స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి ఉపవాస దీక్ష తీసుకుంటారు.
>> ఈ రోజున పిండితో చేసిన అమ్మవారిని పూజించే సంప్రదాయం ఉంది. శుభ ముహూర్తంలో పిండిని పిసికి 64 అమ్మవారి విగ్రహాలను తయారు చేసి, వారందరినీ సక్రమంగా పూజించాలి. బిందీ, కంకణం, నెక్లెస్ మొదలైన మేకప్ పదార్థాలను తయారు చేసి దేవతలకు సమర్పించాలి.
>> పిండిని నైవేద్యంగా చేసి అమ్మవారికి పెట్టాలి. ఈ రోజున అవసరమైన వారికి బట్టలు, ఆహారం మొదలైనవి దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. బ్రాహ్మణునికి ఆహారం పెట్టి ఉపవాస దీక్షను విరమించండి.
Also Read: Radha Ashtami 2022: రాధాష్టమి ఎప్పుడు? శుభ ముహూర్తం, పూజా విధానం తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook