Akshaya Tritiya 2023: ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రేపు అంటే ఏప్రిల్ 22న రాబోతుంది. ఈ రోజు చేసే ఈ పనైనా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు చాలా ప్రత్యేకం. ఈ ఫెస్టివల్ రోజునే బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. అంతేకాకుండా మేషరాశిలో సూర్యుడు, బుధుడు, రాహువు, బృహస్పతి మరియు యురేనస్ గ్రహాల కలయిక వల్ల పంచగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఇది నాలుగు రాశులవారికి మేలు చేయనుంది.
అక్షయ తృతీయ ఈ రాశులకు వరం
వృశ్చిక రాశి - అక్షయ తృతీయ వృశ్చిక రాశి వారికి మేలు చేస్తుంది. మీరు కొత్త వాహనం, ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. జాబ్ చేసేవారికి ఈ సమయం బాగుంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం - కర్కాటక రాశి వారికి అక్షయ తృతీయ నుండి మంచి రోజులు మెుదలవుతాయి. ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.
Also Read:Guru Gochar 2023: మరో 24 గంటల్లో వీరి జాతకం మారిపోనుంది.. ఇందులో మీ రాశి ఉందా?
మేషరాశి - అక్షయ తృతీయ పండుగ మేష రాశి వారికి గోల్డెన్ డేస్ మెుదలవుతాయి. మీరు కెరీర్ లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. పాత సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో దానధర్మాలు చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఈ సమయంలో గోల్డ్ కొనడం మీకు లాభిస్తుంది.
వృషభం - అక్షయ తృతీయ నాడు ఏర్పడే పంచగ్రహి యోగం వృషభ రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీరు మానసిక సమస్యల నుండి బయటపడతారు. మీ లైఫ్ లో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
Also Read: Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ నాడు ఏ టైంలో బంగారం కొంటే మంచిది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook