Nirjala Ekadashi 2023: నిర్జల ఏకాదశి శుభ సమయం, పూజా విధానం, పాటించాల్సిన నియమాలు!

Nirjala Ekadashi 2023: Nirjala Ekadashi Auspicious Time Date Pooja Method Rules  Nirjala Ekadashi 2023 Date: నిర్జల ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు పాటించడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 8, 2023, 11:04 AM IST
Nirjala Ekadashi 2023: నిర్జల ఏకాదశి శుభ సమయం, పూజా విధానం, పాటించాల్సిన నియమాలు!

Nirjala Ekadashi 2023 Date: నిర్జల ఏకాదశిని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ప్రతి ఏడాది జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున నిర్జల వ్రతాన్ని ఆచరిస్తారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ వ్రతంలో భాగంగా ఉపవాసాన్ని పాటిస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శ్రీమహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తులు నమ్ముతారు. అయితే ఈ సంవత్సరం నిర్జల ఏకాదశిని ఏ రోజు జరుపుకోవాలో, ఏయే క్రమంలో పూజా కార్యక్రమాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం..నిర్జల ఏకాదశి మే 30వ తేదీ మధ్యాహ్నం 1.07 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మే 31వ తేదీ మధ్యాహ్నం 1.45 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా శ్రీమహావిష్ణువు పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఈ రోజు తప్పకుండా ఇంటిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా నది స్నానం ఆచరించి పట్టు వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. డీఏ పెంపుపై క్లారిటీ  

నిర్జల ఏకాదశి ఉపవాసం ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి రోజున జరుపుకునే హిందువుల పండగా..ఈ ఏకాదశి రోజున విష్ణువు అనుగ్రహం పొందడానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తారు. ఈ రోజు ఉపవాసాలు పాటిస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మీ జీవితంలో ఎదురయ్యే కష్టులు దూరమవుతాయి. అంతేకాకుండా పుణ్యఫలం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

నిర్జల ఏకాదశి శుభ సమయాలు:
ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి మే 30  మంగళవారం మధ్యాహ్నం 01:07 గంటల నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు. ఉపవాసాలు పాటించేవారు జూన్ 1 ఉదయం 05:24 నుంచి 08:10 వరకు పాటించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కోరుకున్న కోరికలు సులభంగా నేరవేరుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం కూడా లభిస్తుంది. ఈ క్రమంలో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు పాటిస్తేనే ఫలితాలు లభిస్తాయి. నిర్జల ఏకాదశిని భీమసేని ఏకాదశి అని కూడా అంటారు.

Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. డీఏ పెంపుపై క్లారిటీ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News