Navapanchama Rajayogam: సుదీర్ఘకాలం తరువాత మారనున్న దశ, ఈ మూడు రాశులకు ఊహించని డబ్బు, లాభాలు

Navapanchama Rajayogam: గ్రహాల రాశి పరివర్తనం లేదా గోచారంతో చాలా మార్పులు జరుగుతుంటాయి. జ్యోతిష్యం ప్రకారం వివిధ గ్రహాల గోచారం లేదా ఒకే రాశిలో కలయికతో యుతి లేదా యోగం ఏర్పడుతుంటాయి. ఈ ప్రభావం అన్ని రాశులపై పడినా కొన్ని రాశులపై ప్రత్యేకం కానుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 7, 2023, 07:44 AM IST
Navapanchama Rajayogam: సుదీర్ఘకాలం తరువాత మారనున్న దశ, ఈ మూడు రాశులకు ఊహించని డబ్బు, లాభాలు

Navapanchama Rajayogam: హిందూ జ్యోతిష్యం ప్రకారం శుక్రుడు మిథున రాశిలో ప్రవేశిస్తుండటం, శని గ్రహం కుంభరాశిలో ఉండటం అనేది నవ పంచమ రాజయోగాన్ని ఏర్పరుస్తోంది. శని, శుక్ర గ్రహాల మిత్రత్వం కారణంగా 3 రాశులపై ప్రత్యేక ప్రభావం పడనుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గ్రహాల రాశి పరివర్తనం యుతి లేదా యోగం ఏర్పర్చడం వల్ల చాలా రాశులపై ఆ ప్రభావం పడుతుంటుంది. కొన్ని రాశులపై శుభప్రదంగా ఉంటే..మరి కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. అనుకూలించినవారికి కెరీర్ ఉన్నత స్థితికి చేరుకుంటుంది. దాంతోపాటు వ్యక్తికి ధన సంపదలు ప్రాప్తిస్తాయి. శుక్రుడు మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. మరోవైపు శని గ్రహం కుంభరాశిలో విరాజిల్లి ఉన్నాడు. ఈ రెండుగ్రహాల మిత్రత్వం కారణంగా అన్ని రాశుల జీవితాలపై ప్రభావం కన్పిస్తుంది. కానీ మూడు రాశులపై విశేషంగా ఉండనుంది. అభివృద్ధి యోగం ఏర్పడుతుంది. 

ధనస్సు రాశి

ధనస్సు రాశిపై ఈ యగం ప్రభావం దశ మార్చేయనుంది. నవ పంచమ రాజయోగం వివాహితులకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఆస్థి లేదా వాహనాలు కొనే అవకాశముంది. ఇంట్లో శుభ కార్యాలు ప్రారంభించవచ్చు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు కలగనున్నాయి. విదేశాల్లో వ్యాపారం చేసేవారికి మరింతగా ధనలాభం కలుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. ఆరోగ్యపరంగా ఏ విధమైన సమస్యలు తలెత్తవు.

తుల రాశి

జ్యోతిష్యం ప్రకారం నవపంచమ రాజయోగం నిర్మాణంతో తులా రాశి జాతకులకు విశేషమైన లాభాలు కలగనున్నాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కుండలిలో పంచమపాదంలో శని గ్రహం ఉండటం, నవమ పాదంలో శుక్రుడు ఉండటం వల్ల అంతా మంచి జరుగుతుందని అంటారు. ఈ సమయం అదృష్టం తోడుగా ఉంటుంది. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. ఆధ్యాత్మిక యోగం చేయాల్సి ఉంటుంది. శని త్రికోణ రాజయోగం వల్ల ఉద్యోగస్థులకు పదోన్నతి లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కుంభ రాశి

జ్యోతిష్యం ప్రకారం నవ పంచమ రాజయోగం కుంభ రాశి జాతకులకు అనుకూలంగా మారనుంది. బుద్ధి, ఉన్నత స్థితి కారణంగా ఈ యోగం ఏర్పడనుంది. ఈ సందర్బంగా కుంభరాశి జాతకులకు ఊహించని ధనలాభం కలుగుతుంది. మీ పాత పెట్టుబడులు లాభించవచ్చు.షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు లాభాల్ని కలగజేయవచ్చు. పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన సమయం. పనిచేసే చోట ప్రయోజనాలు కలుగుతాయి. ఆత్మ విశ్వాసం వృద్ధి చెందుతుంది.

Also read: Budhaditya yogam 2023: బుధాదిత్య రాజయోగం ప్రభావం, మే 15 నుంచి ఓ నెలరోజులు ఈ 5 రాశులపై కనకవర్షం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News