Naraka Chaturdashi 2022: దీపావళి పండగ భారతీయులకు ఎంతో ప్రాముఖ్యమైన పండగ భారతీయులంతా వివిధ ప్రాంతాల్లో దీపావళి వివిధ రకాలుగా జరుపుకుంటారు కొన్ని రాష్ట్రాల్లో దీపావళి పండుగ ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు అయితే ఈ పండగలో భాగంగా దీపాలను వెలిగించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పండగ రోజున ప్రజలంతా లక్ష్మీదేవి పూజతో పాటు దీపాలు కూడా వెలిగిస్తారు. దీపావళి ముందు ఐదు రోజుల నుంచి దీపాలు వెలిగించడం ప్రారంభిస్తారు. అయితే ఈ పండగలో భాగంగా మట్టి, ఇత్తడి, రాగి దీపాలతో పాటు ఇతర దీపాలను కూడా వెలిగించవచ్చు. ముఖ్యంగా నరక చతుర్దశి రోజున పిండితో చేసిన దీపాలు వెలిగించడం వల్ల మంచి ప్రయోజనాలతో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
పిండి దీపం ప్రాముఖ్యత ఏంటి..?:
నరక చతుర్దశి రోజున వస్తువులను దానం చేయడం సాంప్రదాయంగా వస్తోంది. చాలామంది ఈరోజు యమధర్మరాజు పూజలు కూడా చేస్తారు. ఈ పూజా కార్యక్రమంలో భాగంగా ఇంటి ప్రధాన ద్వారాలు ఉంది పిండితో తయారు చేసిన దీపాలను వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల యమధర్మరాజు అనుగ్రహం లభించి అకాల మరణాలు సంభవించకుండా కాపాడుతాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నారు. అందుకే ఈ పూజలో భాగంగా పిండితో తయారు చేసిన దీపాలను వెలిగిస్తారు.
ఇలాంటి ప్రదేశాల్లో దీపాలను వెలిగించాలి:
ధర్మరాజు పూజలో భాగంగా దక్షిణం దిక్కున అభిముఖంగా ఈ పిండి దీపాలను వెలిగించాల్సి ఉంటుంది. ఈ పిండి దీపాలను వెలిగించి యమునికి ప్రీతికరమైన శ్లోకాలను పాటించాల్సి ఉంటుంది. చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు యమధర్మరాజు అనుగ్రహం కూడా లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నారు.
ఈ దీపాలను ఎలా తయారు చేసుకోవాలి.?:
ముందుగా ఈ దీపాలను తయారు చేసుకోవడానికి ఒక కప్పులు గోధుమ పిండిని తీసుకుని అందులో తగినంత నీటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిశ్రమాన్ని తీసుకొని చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని దీపాల ఆకారంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసిన దీపాలలో నూనె వేసి వెలిగించుకోవాలి. అయితే ఈరోజు ఈ దీపాలను వెలిగించడం వల్ల చనిపోయిన తర్వాత నరకం నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE TELUGU NEWS దీనిని ధృవీకరించలేదు.)
Also Read : Vishnu Manchu Ginna Collections : జిన్నా పరిస్థితి మరీ దారుణంగా.. 50 షోలకు 49 టికెట్లు తెగాయా?
Also Read : Kantara 7 Days collection : ఏడురోజులకు ఐదురెట్ల లాభాలు.. ఆగని కాంతారా కాసుల వర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook