Name Astrology: మీ పేరులో మొదటి అక్షరం ఇదేనా.. అయితే అన్నింటా విజయమే.. డబ్బుకు కొదువే ఉండదు..

Name Astrology Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు అనుగ్రహం పొందే వ్యక్తులకు ధనానికి లోటు ఉండదు. పేరులో ఏ మొదటి అక్షరాన్ని కలిగి ఉంటే గురు అనుగ్రహం పొందగలరో ఇప్పుడు చూద్దాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 19, 2022, 02:07 PM IST
Name Astrology: మీ పేరులో మొదటి అక్షరం ఇదేనా.. అయితే అన్నింటా విజయమే.. డబ్బుకు కొదువే ఉండదు..

Name Astrology Telugu: జ్యోతిష్యశాస్త్రంలో దేవగురు బృహస్పతిని అదృష్ట గ్రహంగా అభివర్ణించారు. గురు అనుగ్రహం పొందిన వారు జీవితంలో ఎంతో పురోగతి, గౌరవం పొందుతారు. అదృష్టం వారి వెన్నంటే ఉంటుంది. సకల సౌఖ్యాలను సులువుగా దరిచేరుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురు అనుగ్రహం పొందే వ్యక్తుల పేర్లు యే, యో, భా, భీ, భూ, ధా, ఫ, ధా, భే, డి, డు, ఠ, ఝా, జె, దే, దో, చ, చి ఇంగ్లీషులో ఇది Y, B, D, C మొదలైన అక్షరాలతో ప్రారంభమవుతుంది. ఈ అక్షరాలతో మొదలయ్యే వ్యక్తుల జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం... 

తమ సంతోషంతో పాటు ఇతరుల సంతోషం :

ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు సాధారణంగా ఉల్లాసంగా ఉంటారు. అదే సమయంలో, వారు ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతారు. ఈ వ్యక్తులు ఇతరుల పట్ల శ్రద్ధ వహించడం, వారికి తోచిన సాయం చేయడం వంటి అద్భుతమైన గుణం కలిగి ఉంటారు. తద్వారా అందరూ వారిని ఇష్టపడుతారు. గురు అనుగ్రహంతో ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. కెరీర్ అయినా, వ్యక్తిగత జీవితం అయినా, సామాజిక జీవితం అయినా ప్రతిచోటా గౌరవం లభిస్తుంది.

డబ్బుకు కొదువ ఉండదు :

ఈ వ్యక్తుల వద్ద డబ్బుకు కొదువ ఉండదు. శ్రమకు, మంచి స్వభావానికి, స్వచ్ఛమైన హృదయానికి వీరు కేరాఫ్. అనుకున్న పనిని పూర్తి చేసేంతవరకు వెనక్కి తగ్గరు. అందుకే జీవితంలో ఉన్నత స్థితిని పొందుతారు. అతనిలోని ఈ గుణాలు ఇతరులను ఇట్టే ఆకర్షిస్తాయి.

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: Livingstone: పసికూన నెదర్లాండ్స్‌కు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్.. ఒకే ఓవర్‌లో 32 పరుగులు బాదిన లివింగ్‌స్టోన్..

Also Read: Konda Film: రేవంత్ రెడ్డి పులి.. దయాకర్ రావుకు డైపర్లే! తీన్మార్ పంచ్ లతో కొండా డాటర్ పొలిటికల్ ఎంట్రీ?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News