Nagula Chavithi 2024: నాగుల పంచమి రోజే శక్తివంతమైన యోగాలు.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు..

Nagula Chavithi 2024: నాగుల పంచమి రోజునే కొన్ని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఆర్థికంగా కూడా అనుకున్న లాభాలు కలుగుతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 8, 2024, 11:10 AM IST
Nagula Chavithi 2024: నాగుల పంచమి రోజే శక్తివంతమైన యోగాలు.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు..

 

Nagula Chavithi Rasi Phalalu 2024: శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఏడాది వచ్చే పంచమి రోజున అనేక శుభ యోగాలు ఏర్పబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఈ సమయంలో శుక్రుడు, బుధుడితో కుజుడు, గురు గ్రహంతో కలయిక జరపబోతున్నాయి. అలాగే కుంభ రాశిలో శని ఉండడం వల్ల శష రాజయోగంతో పాటు ఎంతో ప్రాముఖ్యత కలిగిన లక్ష్మీనారాయణ రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఇదిలా ఉంటే నాగ పంచమి రోజున ఎంతో శక్తివంతమైన సిద్ధయోగం, రవియోగాలు ఏర్పడబోతున్నాయి. అంతేకాకుండా కొన్ని గ్రహాలు నక్షత్ర సంచారం కూడా చేయనున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే నాగ పంచమి రోజున లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశులవారికి లాభాలే.. లాభాలు:
సింహరాశి:

నాగపంచమి రోజు నుంచి సింహ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దీంతో వీరికి జీవితంలో కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోబోతున్నాయి. అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో కూడా మంచి లాభాలు పొందుతారు. ముఖ్యంగా వీరు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జంక్‌ ఫుడ్‌కి కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ సమయంలో వాకింగ్‌ చేయడం వల్ల బోలెడు లాభాలు పొందుతారు.

వృషభ రాశి:
నాగుల పంచమి రోజు నుంచి వృషభ రాశివారికి  అంతా మంచి జరుగుతుంది. దీంతో పాటు సూర్యుడి అనుగ్రహంతో అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి. అలాగే స్నేహితుల నుంచి కూడా మంచి సపోర్ట్‌ పొంది.. సులభంగా అనుకున్న లాభాలు పొందుతారు.. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వీరి ఇంట్లో శాంతి, సంతోషాలు కూడా పెరుగుతాయి. వీరికి మతపరమైన పనులపై కూడా విపరీతమైన ఆసక్తి పెరుగుతుంది. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

మేష రాశి:
నాగ పంచమి రోజున ఏర్పడే శుభ యోగాల కారణంగా మేష రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా వీరికి డబ్బు కెరీర్‌ పరంగా చాలా బాగుంటుంది. అలాగే వీరు కొత్త ఆస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఆర్థిక పరమైన విషయాల్లో ఊహించని పురోగతి లభిస్తుంది. చిన్న చిన్న సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News