Nag Panchami 2022 Puja: శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదో రోజున నాగ పంచమి జరుపుకుంటారు. ఈ రోజున నాగదేవతను (Naga devatha) పూజించడం అనవాయితీ. ఈసారి నాగ పంచమి ఆగస్టు 2, 2022న వచ్చింది. ఈ ఏడాది నాగ పంచమి (Nag Panchami 2022) నాడు ప్రత్యేక యాదృచ్చికం ఏర్పడబోతుంది. అందువల్ల నాగ పంచమి రోజున శుభ ముహూర్తంలో పూజలు చేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది.
నాగ పంచమి రోజున మంగళ గౌరీవ్రతం
నాగ పంచమి ఆగస్టు 2, మంగళవారం వస్తుంది. అదే రోజు యాదృచ్ఛికంగా మంగళగౌరీ వ్రతం కూడా రానుంది. తమ భర్తల దీర్ఘాయువు కోసం మహిళలు ఈ వ్రతాన్ని చేస్తారు. నాగ పంచమి రోజున నాగదేవతతో పాటు పరమశివుడు, పార్వతిని కూడా పూజించనున్నారు.
అదే రోజు 2 శుభయోగాలు
ఈ ఏడాది నాగ పంచమి నాడు మంగళ గౌరీ వ్రతం పాటించడమే కాకుండా 2 శుభ యోగాలు కూడా ఏర్పడనున్నాయి. ఆగస్టు 2వ తేదీన నాగ పంచమి నాడు శివయోగం, సిద్ధి యోగం కూడా ఏర్పడుతున్నాయి. ఈ రెండు యోగాలలో పూజించడం ద్వారా శివుడు మరియు నాగదేవతల అనుగ్రహం మీపై ఉంటుంది. వీరి కృపతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
నాగదేవత పూజ ఎలా చేయాలి?
నాగ పంచమి రోజున అష్టనాగులను పూజించాలి. అవే అనంత, వాసుకి, పద్మ, మహాపద్మ, తక్షక, కులీర్, కర్కట్ మరియు శంఖ. దీని కోసం నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్టించండి. అప్పుడు నాగ దేవతకు పసుపు, రోలీ, అక్షింతలను సమర్పించి...పువ్వలతో అలంకరించిండి. తర్వాత నాగదేవతకు పాలు పోయండి. అనంతరం నాగ పంచమి కథ వినండి. చివరగా హారతి ఇచ్చి..పూజను విరమించండి. హారతి చేయండి. వీలైతే ఈరోజున ఉపవాసం ఉండండి. మీ శక్తి మేరకు పేదవారికి దానం చేయడం మంచిది.
Also Read: Sai baba vrat procedure: కోరిన కోరికలు తీర్చే సాయిబాబా వ్రత విధానం గురించి తెలుసుకోండి
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
నాగపంచమి రోజే మంగళ గౌరీవ్రతం, 2 శుభయోగాలు.. నాగదేవతను ఇలా పూజించండి!
ఆగస్టు 2న నాగపంచమి
అదే రోజు 2 శుభయోగాలు
నాగదేవతను పూజించే విధానం తెలుసుకోండి