Significance Of Nag Panchami: ఈ ఏడాది నాగపంచమి ఆగస్టు 2 మంగళవారం వచ్చింది. శ్రావణ మాసంలోని శుక్ల పంచమి రోజున నాగపంచమి (Nag panchami 2022) జరుపుకుంటారు. ఈ రోజున నాగదేవతను పూజించి.. పాములకు పాలు పోస్తారు. అంతేకాకుండా ఈ రోజు శివుడికి రుద్రాభిషేకం చేస్తారు. ఈ శుభదినాన నాగదేవతను పూజిస్తే జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. అలాంటి నాగ పంచమి రోజు ఈ పనులు చేయాలో , ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం.
ఈ పనులు చేయండి
>> నాగపంచమి రోజున ఉపవాసం ఉండి.. నాగదేవతను పూజించండి. ఇలా చేయడం వల్ల మీరు పాముకాటు నుండి రక్షించబడతారు.
>> నాగదేవతను ఆరాధించేటప్పుడు పాలు, స్వీట్లు, పువ్వులు సమర్పించండి.
>> పూజ చేసేటప్పుడు నాగ పంచమి మంత్రాన్ని తప్పనిసరిగా పఠించండి.
>> మీ జాతకంలో రాహు-కేతువులు ఉంటే.. ఈ రోజున నాగదేవతను పూజించండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి.
>> ఈ రోజున శివలింగంపై ఇత్తడి చెంబుతో పాలు పోయండి. అదే విధంగా రాగిపాత్రతో నీటిని పోయండి. ఇలా చేయడం వల్ల శివుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి.
ఈ పనులు చేయకండి
>> నాగపంచమి రోజున చెట్లను నరకడం, వ్యవసాయం చేయడం మానుకోండి. ఎందుకంటే అలా చేయడం వల్ల అక్కడ నివసించే పాములకు హాని కలుగుతుంది.
>> నాగపంచమిని రోజున పొరపాటున కూడా సూది మరియు దారం ఉపయోగించవద్దు. ఇలా చేయడం అశుభంగా భావిస్తారు.
>> ఈ రోజున వివాదాలకు దూరంగా ఉండండి. ఎవరితోను దూషించే మాటలు మాట్లాడకండి.
>> ఇనుప పాత్రలో ఈ రోజున వంట చేయకండి. అలా చేస్తే నాగదేవతకి ఇబ్బంది కలుగుతుంది.
>> నాగపంచమి రోజున మాంసాహారం లేదా మద్యానికి దూరంగా ఉండండి.
Also Read: Rakhi Pournami 2022: రాఖీ పండుగ ఎప్పుడు? రాఖీ కట్టడానికి శుభ ముహూర్తం తెలుసుకోండి
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook