Amarnath Yatra:అడుగడుగులో అపాయం.. అయినా బెదరని భక్తజనం! అమర్ నాథ్ యాత్ర ఎందుకంత ప్రత్యేకం?

Amarnath Yatra:ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో శివలింగాలు ఉన్నాయి. కాని అమర్ నాథ్ గుహలో ఉన్న శివలింగం మహాద్భుతం.  ఈ గుహ ఎన్నో అద్భుత రహస్యాలకు నిలయమని అంటారు. హిమాలయ పర్వతాల్లో వెలిసిన  ఈ గుహాలయంలో భక్తులకు దర్శనమిచ్చే శివలింగం శుద్ధ స్పటిక రూపం. ఈ హిమలింగం ప్రళయ కాలంలో వెలిసింది

Written by - Srisailam | Last Updated : Jul 9, 2022, 01:47 PM IST
Amarnath Yatra:అడుగడుగులో అపాయం.. అయినా బెదరని భక్తజనం! అమర్ నాథ్ యాత్ర ఎందుకంత ప్రత్యేకం?

Amarnath Yatra:అమర్‌నాథ్‌ యాత్రలో పెను విషాదం సంభవించింది. అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో భక్తులను ముంచెత్తాయి. వరదలకు 16 మంది భక్తులు చనిపోయారు. మరో 40 మంది వరకు గల్లైంతయ్యారు. వరద నీటిలో కొట్టుకుపోయిన వారి ఆచూకి కోసం సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ సైన్యంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు శ్రమిస్తున్నాయి. హెలికాపర్ట ద్వారా గాలింపు కొనసాగుతోంది.తాజా ఘటనతో అమర్ నాథ్ యాత్రపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో ఉండే భోలోనాథ్ దర్శనం కోసం భక్తులు ఎందుకు ఎగబడతారు.. అమర్ నాథ్ గుహలో ఉండే శివాలయం అంత మహిమ గలదా అన్న చర్చలు వస్తున్నాయి. 

ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో శివలింగాలు ఉన్నాయి. కాని అమర్ నాథ్ గుహలో ఉన్న శివలింగం మహాద్భుతం.  ఈ గుహ ఎన్నో అద్భుత రహస్యాలకు నిలయమని అంటారు. హిమాలయ పర్వతాల్లో వెలిసిన  ఈ గుహాలయంలో భక్తులకు దర్శనమిచ్చే శివలింగం శుద్ధ స్పటిక రూపం. ఈ హిమలింగం ప్రళయ కాలంలో వెలిసింది.అందుకే ఆ పరమాత్ముడి దర్శనం కోసం భక్తులు ఎగబడుతుంటారు. అమర్ నాథ్ యాత్ర ఓ సాహసం. అడుగడుగులో అపాయమే.. విరిగిపడే కొండ చరియలు.. ఆకస్మాత్తుగా మారిపోయే వాతావరణం.. పాతాళాన్ని తలపించే ఎత్తైన లోయలు.. యాత్రలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలమీదకు తెచ్చుకున్నట్లే. ప్రకృతి ప్రకోపాలకు తోడు ఉగ్రమూకలు ఎప్పుడు ఎటు వైపు నుంచు విరుచుకుపడుతారో తెలియని పరిస్థితి. ఇలా  కష్టాలు ఉన్నా హిమలింగాన్ని దర్శించుకునేందుకు  వేలాది మంది భక్తులు అమర్ నాథ్ యాత్రకు వస్తారు.

శ్రీనగర్‌కు 141 కిలోమీటర్ల దూరంలోని పహల్గాం నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం అవుతుంది. అమర్‌నాథ్‌ యాత్ర బేస్‌ క్యాంప్‌  పహల్గాంలో ఉంటుంది. ఇక్కడి నుంచి అమర్‌నాథ్‌కు 45 కిలోమీటర్లు. బేస్‌క్యాంప్‌ నుంచి బృందాలుగా అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్తారు. పహల్గాంకు శ్రీనగర్‌ నుంచి రోడ్డు మార్గాన చేరుకోవచ్చు. అక్కడి నుంచి చందన్‌వాడీ వెళతారు. చందన్ వాడీ  నుంచి యాత్ర కష్టంగా మారుతుంది. ఇక్కడి దుకాణాల్లో డ్రైఫ్రూట్స్‌, చాక్లెట్లు, ఇతర తినుబండారాలు కొనుక్కొని తిని మళ్లీ ప్రయాణం చేస్తారు. చందన్‌వాడీ నుంచి గుర్రాలు, డోలీలు అందుబాటులో ఉంటాయి. మూడున్నర అడుగులు ఉండే దారిలో  కొండ అంచుల వెంట కర్ర చేత పట్టుకుని నడుస్తుంటారు.చందన్‌వాడీ నుంచి 11 కిలోమీటర్ల దూరం వెళ్లాక  శేష్‌నాగ్‌  వస్తుంది. ఇక్కడ ఐదు కొండలు పాము పడగల్లా కనిపిస్తాయి. ఇక్కడే ఒక నీలిరంగు చెరువు ఉంటుంది. ఇందులో శంకరుడి ఆభరణం అయిన వాసుకి నిద్రిస్తుందని భక్తుల నమ్మకం. శేష్‌నాగ్‌ దగ్గర భక్తులు బస చేయవచ్చు. శేష్‌నాగ్‌ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో అమర్‌నాథ్‌ వస్తుంది. పహల్గాం, చందన్‌వాడీ నుంచి అమర్‌నాథ్‌కు హెలికాప్టర్‌లో వెళ్లడానికి కూడా అవకాశం ఉంటుంది. 

అమర్‌నాథ్‌ గుహ సముద్ర మట్టానికి 12 వేల 756 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడే శివుడు పార్వతీదేవికి సృష్టి రహస్యాన్ని చెప్పారని ఇతిహాస పురాణాల్లో ఉంది. అమ్మవారికి సృష్టి రహస్యాన్ని తెలపడానికే  తన పరివారాన్ని పరమాత్ముడు ఒక్కో ప్రదేశంలో విడిచిపెట్టారని అంటారు.నందీశ్వరుడిని పహల్గాంలో, నెలవంకను చందన్‌వాడీలో, తన ఆభరణమైన వాసుకిని శేష్‌నాగ్‌ లో, మహాగణేశ పర్వతం దగ్గర వినాయకుడిని, పంచరతన్‌ దగ్గర పంచభూతాలను శివుడు విడిచిపెడతాడు. ఒక్క పార్వతిని మాత్రమే గుహ దగ్గరికి తీసుకొచ్చి.. ఆనంద లాస్యం చేసిన అనంతరం సృష్టి రహస్యాన్ని చెప్పాడని పురాణాల్లో ఉంది. పరమాత్ముడు పార్వతి దేవికి అమర రహస్యాన్ని చెప్పిన ప్రాంతం కావడంతో ఆ గుహకు అమర్‌నాథ్‌ అని పేరు వచ్చిందని పురాణాల్లో ఉంది. 

అమర్‌నాథ్‌ గుహ ఏడాది మొత్తం మంచుతో కప్పి ఉంటుంది. ఏటా జూలై ఆగస్టు నెలల్లో 45 రోజుల పాటు భక్తులకు దర్శనం కల్పిస్తారు. గుహలో మంచు శిఖరంలా హిమ శివలింగం దర్శనమిస్తుంది. చంద్రుని వృద్ధి, క్షయాలను సూచిస్తూ ఈ లింగాకృతి పెరుగుతూ, తగ్గతూ వుంటుంది. గరిష్ఠంగా ఆరు అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది.శతాబ్దాలుగా సాగుతున్న అమర్‌నాథ్‌ యాత్ర  ఉగ్రవాదుల దాడుల కారణంగా ఐదేళ్లపాటు రద్దయింది. ఉగ్రవాదుల నుంచి భక్తులకు ముప్పు ఉండటంతో 1991-95 వరకు ఐదళ్లపాటు యాత్ర జరగలేదు. యాత్రికులపై కాల్పులు జరపబోమని ఉగ్రవాదులు హామీ ఇవ్వడంతో 1996ను అమర్ నాథ్ యాత్రను పునరుద్ధరించారు.

READ ALSO: Ravindra Jadeja: సీఎస్‌కేని వీడనున్న రవీంద్ర జడేజా.. బెంగళూరులోకి జడ్డు!  

READ ALSO:  Mahesh Babu- Trivikram Movie: ఆగస్టులో రంగంలోకి మహేష్ బాబు.. సమ్మర్ టార్గెట్ ఫిక్స్  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News