Lucky Birth: హిందూ మత విశ్వాసాల ప్రకారం పుట్టిన ప్రతి ఒక్కరికి జాతకం ఉంటుంది. ఇది ఆ వ్యక్తి పుట్టిన రాశి, నక్షత్రం, తేదీ, గ్రహాన్ని బట్టి మారుతుంటుంది. ఒకే నెల, ఒకే రాశి, ఒకే తేదీన పుట్టినవారిలో చాలా అంశాలు ఒకేలా ఉంటాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
జ్యోతిష్యం ప్రకారం కొన్ని నెలలు, రాశులలో జన్మించినవారి జాతకం చాలా అదృష్టదాయకమని చెప్పవచ్చు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పర్సనాలిటీని బట్టి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకునే విధానాలున్నాయి. జనవరి నుంచి డిసెంబర్ వరకూ వివిధ నెలల్లో జన్మించినవారికి వివిధ అంశాల్లో ప్రత్యేకతలుంటాయి. పుట్టుకతోనే అదృష్టవంతులుగా ఉండేవాళ్ల గురించి తెలుసుకుందాం..ముఖ్యంగా జనవరి, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో పుట్టినవారి అదృష్టం గురించి పరిశీలిద్దాం..
జనవరి నెలలో పుట్టినవాళ్లు చాలా అదృష్టవంతులు. వీరిలో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. అదే సమయంలో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో పుట్టినవారిలో సర్దుకుపోయే గుణం ఎక్కువ. ఎలాంటి సందర్భంలోనైనా తమను తాను అందుకు అనుగుణంగా మల్చుకుంటారు. సెన్సాఫ్ హ్యూమర్ అద్భుతంగా ఉంటుంది. క్షణాల్లో అవతలివ్యక్తుల మూడ్ సరిచేసి అక్కడంతా ఆనందం నింపేయగలరు.
ఇక ఆగస్టులో జన్మించినవాళ్లలో హిడెన్ ట్యాలెంట్ ఎక్కువగా ఉంటుంది. వీళ్లు తమ ఇష్టానికి రాజాలు. ఏ విషయమైన స్పష్టంగా చెప్పగలరు. చాలా బుద్ధిమంతులు, అధృష్టవంతులు కూడా. మొదట్లో కష్టాలు ఎదుర్కొన్నా ఆ తరువాత అంతా రాజసమే. మంచి జీవితాన్ని చవిచూస్తారు. ఆనందకరమైన, ఆహ్లాదకరమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. బాగా ప్రేమించేవాళ్లు జీవిత భాగస్వామిగా వస్తారు.
అక్టోబర్ నెలలో పుట్టినవాళ్లు కాస్త ఎమోషనల్, ప్రాక్టికల్‌గా ఉంటారు. దాంతోపాటు ప్రేమ వ్యవహారాల్లో నిక్కచ్చిగా ఉంటారు. వీరిలో ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది. వయస్సు పెరిగినా యువకుల్లానే కన్పిస్తారు. మాటలతో అవతలి వ్యక్తుల్ని తమవైపుకు ఆకర్షించగలరు. బంధాలను సరిగా అర్దం చేసుకోవడమే కాకుండా అన్ని బందాలు కొనసాగిస్తారు. ఈ నెలలో పుట్టినవారికి కోర్కెలు, కలలు ఎక్కువ. తమ కలల్ని నెరవేర్చుకుంటారు కూడా. విజయ శిఖరాలకు చేరుకోగలరు. సంపద, డబ్బులు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అయినా గర్వం అనేది ఉండదు.
Also read: Budh Gochar 2023: కర్కాటకంలో బుధుడి సంచారం.. ఈ 3 రాశులకు శుభం, ఈ 2 రాశులకు అశుభం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook