Budha Asta 2023: జనవరి 2న ధనుస్సు రాశిలో బుధుడి అస్తమయం... ఈ 4 రాశుల వారు నష్టపోవడం ఖాయం..

2023 Budh Gocahr: జనవరి 2న బుధుడు ధనుస్సు రాశిలో అస్తమించనున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారు అనేక సమస్యలను ఎదుర్కొంటారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2022, 10:36 AM IST
Budha Asta 2023: జనవరి 2న ధనుస్సు రాశిలో బుధుడి అస్తమయం... ఈ 4 రాశుల వారు నష్టపోవడం ఖాయం..

Budh Gochar 2023: న్యూ ఇయర్ ప్రారంభంలో గ్రహాల స్థానంలో పెనుమార్పు రానుంది. జనవరి 2, 2023న మధ్యాహ్నం 2.33 గంటలకు బుధుడు ధనుస్సు రాశిలో అస్తమిస్తాడు. జనవరి 13, 2023 వరకు బుధుడు అదే స్థితిలో ఉంటాడు. ఇది మొత్తం 12 రాశుల వారిపై అనుకూల మరియు ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. బుధుడు అస్తమించడం వల్ల కొన్ని రాశులవారి కష్టాలు పెరుగుతాయి. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మేషరాశి (Aries): బుధుడు అస్తమించడం వల్ల ఈ రాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడండి, లేకుంటే విభేదాలు రావచ్చు. ఈ సమయంలో మీరు ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోండి. 
వృషభం (Taurus): ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడానికి దూరంగా ఉండండి, లేకుంటే నష్టాలు సంభవించవచ్చు. మీరు కొన్ని వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది. ఇతరులతో మీ సంబంధాలు చెడిపోతాయి. 

మిధునరాశి (Gemini): ఈ సమయంలో మీరు పార్టనర్ షిప్ తో వ్యాపారం చేయకండి, లేకుంటే నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. మీ కుటుంబంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. దీని కారణంగా మీరు అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.
కర్కాటక రాశి (Cancer): ధనుస్సు రాశిలో బుధుడు అస్తమించడం వల్ల ఈ రాశి వారు వృత్తిలో సమస్యలు ఎదుర్కొంటారు. వృత్తి జీవితంలో మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయాణాలు మీకు అనుకూలించవు. మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు. ఈ సమయంలో మీరు మోసపోయే అవకాశం కూడా ఉంది. 

Also Read: Budh Vakri 2023: తిరోగమనంలో బుధుడు.. 2023లో ఈ 3 రాశుల భవితవ్యం మారడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News