Mercury transit 2023: ఫిబ్రవరి 27న బుధాదిత్య రాజయోగం.. ఈరాశులకు జాక్ పాట్ ఖాయం..

Budh Gochar 2023: గ్రహాల రాకుమారుడు మెర్క్యూరీ కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా ఐదు రాశులవారికి మంచి ప్రయోజనం కలుగనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2023, 04:53 PM IST
Mercury transit 2023: ఫిబ్రవరి 27న బుధాదిత్య రాజయోగం.. ఈరాశులకు జాక్ పాట్ ఖాయం..

Budh Gochar 2023: గ్రహాల యువరాజైన బుధుడు రాశి మార్పు ఫిబ్రవరి 27న జరగబోతోంది. ఆ రోజు సాయంత్రం 04.55 గంటలకు కుంభరాశిలో బుధుడి సంచారం జరగనుంది. అనంతరం మార్చి 16, 10.54 గంటలకు మెర్క్యూరీ మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే కుంభరాశిలో సూర్యుడి సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల అరుదైన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈయోగం వల్ల 5 రాశులవారి కెరీర్అద్భుతంగా ఉండబోతుంది. 

బుధాదిత్య యోగం ఈ రాశులకు శుభప్రదం
మేషం: మెర్క్యురీ సంచారం మేషరాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగుల జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. మీ బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. 
వృషభం: కుంభరాశిలో బుధగ్రహ సంచారం మీకు మంచి లాభాలను ఇస్తుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. ధనప్రాప్తి కలుగుతుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. 
మిథునం: బుధాదిత్య యోగం మీ రాశివారికి అదృష్టాన్ని ప్రకాశింపజేయనుంది. ఉద్యోగులు మంచి రోజులు రానున్నాయి. మీ కెరీర్ లో పురోగతి ఉంటుంది. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. మీ కోరికలు నెరవేరుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి.
తుల: బుధ గ్రహ సంచారం వల్ల మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. 
ధనుస్సు: మీ మాటలతో మీరు ప్రజలను ఆకట్టుకుంటారు. ఉద్యోగులకు పదవి లభిస్తుంది. మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  ఆఫీసులో మీకు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. మీరు మీ పనులను సక్రమంగా పూర్తిచేస్తారు. మెుత్తానికి ఈసమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 

Also Read: Venus transit 2023: మార్చి 12 వరకు మీనరాశిలో శుక్రుడు.. ఈ 3 రాశులకు ఊహించనంత డబ్బు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

అండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News