Lucky Zodiac Sign: ఈ ఐదు రాశుల జాతకులు ఇవాళ్టి నుంచి అత్యంత ధనికులౌతారు

Lucky Zodiac Sign: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నెలలో గ్రహాల గోచారం ఎక్కువగా ఉంది. వివిధ గ్రహాలు నిర్ణీత సమయంలో రాశి పరివర్తనమే గ్రహ గోచారంగా పిలుస్తారు. ఈ గోచారం ప్రభావంతో ఈ రాశి జాతకులు ఇవాళ్టి నుంచి అత్యంత ధనికులుగా మారిపోవడం ఖాయం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 16, 2023, 06:50 AM IST
Lucky Zodiac Sign: ఈ ఐదు రాశుల జాతకులు ఇవాళ్టి నుంచి అత్యంత ధనికులౌతారు

Lucky Zodiac Sign: హిందూ పంచాంగం ప్రకారం మార్చ్ 16 అంటే ఇవాళ బుధుడు కుంభరాశి నుంచి బయటికొచ్చి మీనరాశిలో ప్రవేశించనున్నాడు. దాంతో కొన్ని రాశులకు అంతులేని లాభాలు కలుగుతాయి. పెద్దఎత్తున పేరు సంపాదిస్తారు. విజయాలు లభిస్తాయి. వద్దంటే డబ్బు వచ్చి పడుతుంది.

హిందూ జ్యోతిష్యం ప్రకారం బుధుడిని గ్రహాల రాజకుమారుడిగా పిలుస్తారు. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి మారుతుంటుంది. మార్చ్ 16వ తేదీన బుధుడు మీనరాశిలో ప్రవేశించనున్నాడు. ఇవాళ ఉదయం 10 గంటల 54 నిమిషాలకు బుధుడి గోచారముంది. ఈ సందర్భంగా సూర్య, బుధ గ్రహాల యుతి ఏర్పడనుది. బుధుడి మీనరాశి గోచారం 5 రాశులకు ఊహించని ధనలాభాన్ని కలగజేయనుంది. ఈ రాశి జాతకులు ధనం, పెట్టుబడి, వ్యాపారం, కీర్తి సాధిస్తారు. 

వృశ్చిక రాశి

వ్యాపార సంబంధిత వర్గాలకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో వ్యాపారం పెంచేందుకు కీలకమైన పెట్టుబడి లభించవచ్చు. భాగస్వామి ప్రతిపాదన ఉంటుంది. ఈ గోచారం ఈ రాశి జాతకులకు అనువైనది. షేర్ మార్కెట్‌లో పెట్టబడులకు దూరంగా ఉండాలి. ఆర్ధికంగా కష్టాలుండవు. ఆరోగ్యం సైతం బాగుంటుంది.

మీన రాశి

జ్యోతిష్యం ప్రకారం బుధుడు మీనరాశిలో ప్రవేశించనున్నాడు. ఈ సమయం ఈ రాశి జాతకులకు సుఖసంతోషాలనిస్తుంది. వ్యాపారంలో తీసుకునే నిర్ణయాలు ఇతరులకు విచిత్రంగా అన్పించవచ్చు. మీ మాట ప్రభావం ఇతరులపై పడుతుంది. పెళ్లి విషయాలు ఖాయమౌతాయి. ఆర్థికంగా కలిసొస్తుంది. 

వృషభ రాశి

జ్యోతిష్యం ప్రకారం మీన రాశిలో బుధుడి గోచారం ప్రభావం శుభ సూచకంగా ఉంటుంది. ఈ సందర్భంగా ధనయోగం కలుగుతుంది. ప్రత్యేకించి స్నేహితుడి సహాయం లభించవచ్చు. పెట్టుబడులకు అనువైన సమయం. భవిష్యత్తులో లాభదాయకం కాగలదు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సమయంలో ఏదైనా అవార్డు లేదా సత్కారం లభిస్తుంది.

మకర రాశి

జ్యోతిష్యం ప్రకారం బుధుడి గోచారంతో విద్యారంగానికి చెందినవారికి పదవి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రభుత్వ పనులకు సంబంధించిన పనుల్లో విజయం లభిస్తుంది. ఈ సమయంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఆర్ధిక ఇబ్బందులు దూరమౌతాయి. 

కర్కాటక రాశి

బుధుడి రాశి పరివర్తనం ప్రభావం ఈ రాశి జాతకులకు విశేష లాభాలనిస్తుంది. ఈ సమయంలో విదేశీ ప్రయాణాల యోగం ఉంటుంది. విదేశాల్లో చదవాలనే కోరిక నెరవేరుతుంది. వ్యాపారులకు ఈ సమయంలో మంచి లాభాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు. ఆర్ధికంగా ఏ విధమైన ఇబ్బందులుండవు. 

Also read: Mars Transit 2023: మిథున రాశిలో కుజ సంచారం.. ఈ 4 రాశుల వారు మే 10 వరకు జాగ్రత్తగా ఉండాలి! భారీ నష్టం తప్పదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News