Budh Vakri 2022: గ్రహాల యువరాజు బుధుడు తన రాశి చక్రాన్ని మార్చినప్పుడల్లా దాని ప్రభావం మెుత్తం 12 రాశుల ప్రజలపై ఉంటుంది. సెప్టెంబరు 10న మెర్య్కూరీ కన్యారాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. బుధుడు...వాక్కు, కమ్యూనికేషన్ మెుదలైన వాటికి కారకుడిగా భావిస్తారు. వ్యక్తి జాతకంలో బుధుడు స్థానం బలంగా ఉంటే ఆ వ్యక్తులు మంచి వక్తలుగా పరిగణించబడతారు. అంతేకాకుండా వీరికి వ్యాపార, వాణిజ్య, ఆర్థిక, అకౌంటింగ్ రంగాలలో మంచి అవగాహన కలిగి ఉంటారు.
సెప్టెంబర్ 10, 2022న శనివారం ఉదయం 8.42 గంటలకు బుధుడు కన్యారాశిలో తిరోగమనం (Budh Vakri 2022) చేస్తాడు. దీని తరువాత బుధుడు అక్టోబర్ 2, ఆదివారం నాడు కన్యారాశిలో తన మార్గాన్ని ప్రారంభిస్తాడు. పంచాంగం ప్రకారం, బుధుడు అక్టోబర్ 26 బుధవారం నాడు కన్యారాశి నుండి తులరాశికి మారనున్నాడు. సాధారణంగా బుధుడు 24 రోజులకొకసారి తన రాశిని మారుస్తుంది. ఆస్ట్రాలజీ ప్రకారం, మిథునంతోపాటు కన్యారాశిని బుధుడు పాలిస్తాడు. బుధుడు తన సొంతరాశిలోనే తిరోగమనం చేయడం కొన్నిరాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మిధునరాశి (Gemini): మిథునరాశి వారికి మెర్క్యురీ సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. మీ పని తీరు పట్ల ఉన్నతాధికారులు సంతృప్తి చెందుతారు. మీ శ్రమకు తగ్గ ఫలితాలను అందుకుంటారు. జాబ్ కోసం ఎదురుచూస్తున్న వారి కల ఫలిస్తుంది.
కర్కాటకం(Cancer): కర్కాటక రాశి వారి జీవితంలో బుధ సంచారం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. పిల్లల వైపు నుండి శుభవార్తలు వింటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.
సింహరాశి (Leo): సింహ రాశి వారికి బుధ సంచారం చాలా ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆఫీసులో ఉన్నతాధికారులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
Also Read: Mayurshikha Plant: ఈ మొక్క ఇంట్లో నాటితే.. అదృష్టం మీ వెంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
.