Budha Vakri September 2022: సెప్టెంబర్ 10న బుధుడు తిరోగమనం... ఈ 3 రాశులకు అపారమైన ప్రయోజనం..

Budha Vakri 2022: గ్రహాల రాకుమారుడు బుధుడు ఈ నెల 10న రాశిని మార్చనున్నాడు. మెర్క్యూరీ రాశి మార్పు మూడు రాశులవారికి కలిసిరానుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 4, 2022, 02:48 PM IST
Budha Vakri September 2022: సెప్టెంబర్ 10న బుధుడు తిరోగమనం... ఈ 3 రాశులకు అపారమైన ప్రయోజనం..

Budha Vakri 2022: అంతరిక్షంలో గ్రహాల మార్పు ప్రతి ఒక్కరిపై పెను ప్రభావం చూపుతుంది. ఈనెల 10వ తేదీ, ఉదయం 8:42 గంటలకు మెర్క్యూరీ కన్యారాశిలో తిరోగమనం (Mercury retrograde in Virgo 2022) చేయనున్నాడు. అక్టోబరు 2 నుంచి బుధుడు కన్యారాశిలో మార్గంలో ఉంటాడు. అనంతరం బుధగ్రహం అక్టోబర్ 26, బుధవారం నాడు కన్యారాశి నుండి తులరాశిలోకి ప్రవేశిస్తుంది. గ్రహాల యువరాజు బుధుడు...తెలివితేటలు, ఏకాగ్రత, అందానికి కారకుడు. మెర్క్యురీ గ్రహం యొక్క తిరోగమనం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.  

ఈ రాశులకు అపారమైన ప్రయోజనం
మిధునరాశి (Gemini): మెర్క్యురీ తిరోగమనం ఈ రాశి వారికి మేలు చేస్తుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఈ సమయంలో ఉద్యోగులకు ఆదాయం మెండుగా ఉంటుంది. వ్యాపారులు కష్టపడినప్పటికీ లాభాలను అందుకుంటారు. 

కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారికి మెర్క్యురీ తిరోగమనం శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. 

సింహరాశి(Leo): సింహ రాశి వారికి బుధుని తిరోగమనం సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ రాశి ప్రజలు ఉద్యోగ-వ్యాపారాలలో భారీగా డబ్బును ఆర్జిస్తారు. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు విజయం సాధిస్తారు. 

Also Read: Mars Transit in Gemini 2022: కుజుడు రాశి మార్పు... ఈ 3 రాశుల వారి లైఫ్ అదుర్స్..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News