Mercury Planet Margi 2022: ఏదైనా గ్రహం సంచారం మరియు తిరోగమనంలో ఉన్నప్పుడు.. అది అన్ని రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల యువరాజు బుధుడు సెప్టెంబర్ 10న కన్యారాశిలో తిరోగమనం చేశాడు. ఇది రెండు రోజుల కిందట అంటే అక్టోబరు 2న కన్యారాశిలో ప్రత్యక్ష సంచారంలోకి వచ్చింది. కన్యారాశిలో బుధుడు మార్గంలో (Budh margi in Kanya Rashi 2022) ఉండటం వల్ల కొన్ని రాశులవారికి మేలు జరుగుతుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
సింహం (Leo)- కన్యారాశిలో మెర్య్కూరీ సంచారం ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. భాయ్ దూజ్ రోజున గ్రహాలు మరియు రాశుల కదలికల ప్రభావం ఈ రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుంది. సింహరాశి యెుక్క రెండో ఇంట్లో బుధుడు సంచరించనున్నాడు. ఇది డబ్బు, ప్రసంగాల ఇల్లుగా పరిగణిస్తారు. దీంతో ఈ రాశివారు ఆకస్మిక ధనలాభం పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారులు పెద్ద డీల్ కుదుర్చుకోవచ్చు. పార్టనర్ షిప్ తో పనులు ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. విదేశాలకు వెళ్లేందుకు ఇదే అనుకూల సమయం. ఈ సమయంలో టైగర్ స్టోన్ ధరించడం వల్ల మేలు జరుగుతుంది.
వృశ్చికం (Scorpio)- ఈ రాశిచక్రం యొక్క వ్యక్తుల జీవితంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయి. బుధుడు ఈ రాశి యొక్క 11 వ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీనిని లాభాలు, ఆదాయాల ఇల్లుగా భావిస్తారు. దీంతో మీ ఆదాయం భారీగా పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ఈ సమయంలో మణి రాయిని ధరించడం అదృష్టం.
ధనుస్సు (Sagittarius)- బుధ మార్గి ఈ రాశివారికి కలిసి వస్తుంది. ఈ రాశిచక్రం యెుక్క పదో ఇంట్లో బుధుడు సంచరించనున్నాడు. ఇది పని, వ్యాపారం, ఉద్యోగాల ఇల్లుగా భావిస్తారు. దీంతో మీరు కొత్త జాబ్ పొందవచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ విస్తరించడానికి ఇదే మంచి సమయం.
Also Read: Shani Margi 2022 Rajyog: శని మహాపురుష రాజయోగం... ఈ 5 రాశులవారికి అంతులేని ధనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook