Budhaditya Yoga: బుధాదిత్య యోగం వల్ల ఈ 4 రాశులవారి జాతకం మారిపోనుందట..!

Budhaditya Yoga: ధనుస్సు రాశిలో ఏర్పడిన బుధాదిత్య యోగం వల్ల కొన్ని రాశులవారికి లబ్ధి చేకూరనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2022, 10:53 AM IST
Budhaditya Yoga: బుధాదిత్య యోగం వల్ల ఈ 4 రాశులవారి జాతకం మారిపోనుందట..!

Budhaditya Yoga effect:  ఈనెల 16వ తేదీన బుధుడు, సూర్యుడి కలయిక వల్ల ధనుస్సు రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడింది. దీని ప్రభావం ఈ ఏడాది చివరి వరకు ఉంటుంది.  బృహస్పతి యెుక్క రాశిలో ఏర్పడిన ఈ బుధాదిత్య యోగం (Budhaditya Yoga) కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. వీరు కెరీర్ లో గొప్ప పురోగతితో భారీ మెుత్తంలో ధనాన్ని సంపాదిస్తారు. బుధాదిత్య యోగం వల్ల ఏ రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకుందాం. 

మేషరాశి (Aries):  బుధాదిత్య యోగం వల్ల మేషరాశి వారి అదృష్టం కలిసి వచ్చి వీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కెరీర్ లో పురోగతికి అపారమైన అవకాశాలున్నాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మెుత్తానికి ఈ టైం మీకు కలిసి వస్తుంది. 

మిథునం (Gemini): బుధాదిత్య యోగం మీకు చాలా శుభప్రదంగా మరియు ఫలప్రదంగా ఉంటుంది. మీకు ఆఫీసులో మీ సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. పార్టనర్‌షిప్‌తో వ్యాపారం చేసే వారు లాభపడతారు. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాలు కూడా మీకు అనుకూలిస్తాయి. బిజినెస్ బాగా జరుగుతుంది. 

కుంభం (Aquarius): సూర్యుడు మరియు బుధుడు చేసిన బుధాదిత్య యోగ ప్రభావం కుంభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ధనుస్సు రాశిలో ఏర్పడిన బుధాదిత్య యోగం మీకు ఆర్థికంగా సహాయం చేస్తుంది. ఈ సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ఉద్యోగం మారాలనుకునేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది. 

మీనం (Pisces): మీరు జీవితంలో పురోగతి సాధిస్తారు. వ్యాపారవేత్తలు భారీగా లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. దీని వల్ల మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. మెుత్తానికి ఈ టైం మీకు కలిసి వస్తుంది. 

Also Read; Bhogi Festival: 2023లో భోగి పండుగ ఎప్పుడు వచ్చింది? ఈ ఫెస్టివల్ ప్రాముఖ్యత ఏంటి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News