Mars Transit 2023: కర్కాటక రాశిలో అంగారకుడి సంచారం, ఈ రాశులవారిపై దరిద్ర యోగం ప్రభావం!

Mars Transit in Cancer 2023: కర్కాటక రాశిలో అంగారకుడి సంచారం చేయడం వల్ల అన్ని రాశులవారి జీవితాల్లో తీవ్ర మార్పులు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా తీవ్ర ఆర్థిక సమస్యలు కూడా రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.   

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 10, 2023, 09:25 AM IST
Mars Transit 2023: కర్కాటక రాశిలో అంగారకుడి సంచారం, ఈ రాశులవారిపై దరిద్ర యోగం ప్రభావం!

Mars Transit in Cancer 2023: కర్కాటక రాశిలో అంగారకుడి సంచారాన్ని జ్యోతిష్య శాస్త్రంలో అశుభకరమైన సంఘటనగా భావిస్తారు. ఈ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి దరిద్ర యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని, కుజుడు, రాహువు గ్రహాలు ఏదైన రాశి 2 వ, 6 వ, 8 వ లేదా 12 వ స్థానంలో ఈ గ్రహాలు ఉంటే దరిద్ర యోగం ఏర్పుడుతుంది. ఈ యోగం వల్ల అన్ని రాశులవారి జీవితాల్లో తీవ్ర మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఆర్థిక పురోగతి కూడా దెబ్బతింటుంది. కూడబెట్టిన మూలధనం ఈ క్రమంలో సులభంగా ఖర్చవుతుంది. దీంతో మీరు అప్పుల పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ అంగారక సంచారం వల్ల ఏర్పడిన దరిద్ర యోగం వల్ల మూడు రాశుల స్థానికులు 52 రోజుల పాటు చాలా ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో ఏయే చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మిథునరాశి:
దరిద్ర యోగం వల్ల మిథునరాశివారికి తీవ్ర నష్టాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన ఇబ్బందుల పాలవుతారు. ఖర్చులు పెరుగడమే కాకుండా ఆదాయంలో మార్పులు వస్తాయి. మిథున రాశి వారు ఈ క్రమంలో వ్యాపారంలో పెట్టుబడులు పెడితే తీవ్ర నష్టాలు కలుగుతాయి. అంతేకాకుండా శత్రువులతో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

పరిహారం: ఉసిరి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించి ప్రదక్షిణం చేయండి.

Also Read: Hyundai Creta Price 2023: కేవలం 2 లక్షలకే కొత్త హ్యుందాయ్ క్రెటాను ఇంటికి తీసుకెళ్లండి.. పూర్తి వివరాలు ఇవే!

మకర రాశి:
మకర రాశి వారిపై కూడా దరిద్ర యోగం ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మకర రాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రమంలో మిమ్మల్నీ ఎవరైన మోసం చేసే ఛాన్స్‌ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ ప్రభావం ఆర్థిక పరిస్థితిపై కూడా పడుతుంది. దరిద్ర యోగ ప్రభావం వల్ల మీ వైవాహిక జీవితం చాలా ప్రభావితమవుతుంది. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా కోపాన్ని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
 
పరిహారం: రాబోయే 52 రోజులు ప్రతి ఆదివారం, గురువారాల్లో పేదలకు ఏదైనా దానం చేయాలి. కావాలంటే అన్నదానం, వస్త్రదానం చేయవచ్చు.

మీనరాశి:
కర్కాటక రాశిలో కుజుడు సంచరించడం వల్ల ఏర్పడే నీచ యోగం మీనరాశి వారిపై కూడా ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ 52 రోజుల పాటు ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మీ పెద్దలు లేదా స్నేహితులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చట్టపరమైన విషయంలో చిక్కుకోకుండా ఉండడం చాలా మంచిది. 

పరిహారం: లక్ష్మీ దేవిని పూజించి..మంత్రాలను కనీసం 108 సార్లు జపించండి. 

Also Read: Hyundai Creta Price 2023: కేవలం 2 లక్షలకే కొత్త హ్యుందాయ్ క్రెటాను ఇంటికి తీసుకెళ్లండి.. పూర్తి వివరాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News