Mars Transit 2022: అక్టోబర్ 16న మిథున రాశిలోకి అంగారకుడు.. ఈ 5 రాశుల వారికి దీపావళి రోజున అదృష్టమే!

MarsTransit in Gemini on 16 October 2022. అక్టోబర్ 16న మిథున రాశిలోకి అంగారకుడు ప్రేవశించనున్నాడు. ఈ సంచారం కారణంగా దీపావళి 2022 రోజున 5 రాశుల వారికి అంతా శుభమే జరగనుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 14, 2022, 10:53 AM IST
  • అక్టోబర్ 16న మిథున రాశిలోకి అంగారకుడు
  • ఈ 5 రాశుల వారికి దీపావళి రోజున అదృష్టమే
  • ఆదాయం భారీగా పెరుగుతుంది
Mars Transit 2022: అక్టోబర్ 16న మిథున రాశిలోకి అంగారకుడు.. ఈ 5 రాశుల వారికి దీపావళి రోజున అదృష్టమే!

MarsTransit in Gemini on 16 October 2022: గ్రహాల అధిపతి 'అంగారక గ్రహం' అందరికీ మేలు చేస్తుంది. అంగారక గ్రహం ఎప్పుడూ తమ రాశిని మార్చినా.. చాలా రాశుల వారు అద్భుత ప్రయోజనాలను పొందుతారు. ఈసారి దీపావళి పండగకి ముందే అంగారక గ్రహ సంచారం జరుగుతోంది. అక్టోబర్ 16న మిథున రాశిలోకి అంగారకుడు అడుగుపెట్టబోతున్నాడు. ఈ సంచారం (మంగల్ గోచార్ అక్టోబర్ 2022) కారణంగా ఈ దీపావళి రోజున 5 రాశుల వారికి అంతా శుభమే జరగనుంది. ఆ అదృష్ట 5 రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. 

వృషభం: 
కుజ సంచారం (మంగల్ గోచర్ 2022) కారణంగావృషభ రాశి వారికి ఆదాయం భారీగా పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం మరియు శాంతి నెలకొంటుంది. వ్యాపారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌ వచ్చే అవకాశం ఉంది. 

సింహం: 
కుజ సంచారం కారణంగా సింహ రాశి వారికి బాగా కలిసిరానుంది. సింహ రాశి వారికి ఉద్యోగ మార్చు ఉంది. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో వ్యాపారాలు విస్తృతమవుతాయి. ప్రతి విషయంలో తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. 

తుల: 
కుజ సంచారం కారణంగా తుల రాశుల వారు కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తారు. మనస్సు  ప్రశాంతంగా ఉంటుంది. చదువుల్లో విజయం సాధిస్తారు. స్వంత ఇంటిని కొనుగోలు చేయవచ్చు. ఉద్యోగంలో ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు.

ధనుస్సు: 
అంగారకుడి సంచారం కారణంగా ధనుస్సు రాశి వారు ఉద్యోగంలో అదనపు బాధ్యతలను పొందవచ్చు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పాత స్నేహితులు లేదా బంధువు ఇంటికి రావచ్చు. కుటుంబంతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. 

కుంభం: 
కుంభ రాశి వారు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడగలరు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. కొత్త ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. స్నేహితులతో లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు మరియు సమాచారంపై ఇవ్వబడింది. ZEE NEWS దీన్ని నిర్ధారించలేదు.)
Also Read: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. బద్దలవనున్న ధోనీ, యువరాజ్, గేల్ రికార్డ్స్!

Also Read: టీ20 ప్రపంచకప్‌లో భువనేశ్వర్‌ రాణించలేడు.. టీమిండియాకు కష్టాలు తప్పవు: వసీం అక్రమ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News