హిందూ జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా మంగళ గ్రహాన్ని గ్రహాలకు సేనాపతిగా పిలుస్తారు. మార్చ్ 13న ఉదయం 5 గంటల 35 నిమిషాలకు మంగళ గ్రహం మిధున రాశిలో ప్రవేశించనుండటంతో ఒక్కొక్క రాశిపై ఒక్కోలా ప్రభావం ఉండనుంది. ఆ వివరాలు మీ కోసం..
మేషరాశి జాతకులకు మంగళ గ్రహం మిధున రాశి ప్రవేశం మూడవ పాదంలో ఉంటుంది. ఈ సందర్భంగా ఆస్థుల రంగంలో పనిచేసేవారికి అపార లాభం కలగవచ్చు. ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలరు.
వృషభ రాశి జాతకులకు మిధున రాశి ప్రవేశం రెండవ పాదంలో ఉంటుంది. ఈ క్రమంలో మీ మాటపై సంయమనం పాటించాలి. జీవితంలో ఎగుడు దిగుడు ఉంటుంది. ఆరోగ్యంపై ధ్యాస అవసరం. తండ్రి సంపద విషయంలో అనుకోనిది జరగవచ్చు. మానసిక ఒత్తిడి ఉంటుంది.
మిధున రాశిలో మంగళ గ్రహం గోచారం లగ్నపాదంలో ఉంటుంది. ఈ నేపధ్యంలో మీ వ్యవహారశైలిపై దృష్టి పెట్టాల్సి వస్తుంది. గొడవల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏ విధమైన కొత్త వ్యవహారాలు చేపట్టవద్దు. బిల్డింగులు, స్థలం కొనుగోలు చేయవద్దు. లేకపోతే నష్టాన్ని ఎదుర్కోవల్సివస్తుంది.
కర్కాటక రాశి జాతకులకు మంగళ గోచారం కష్టాల్ని మరింతగా పెంచేస్తుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి. అనవసరంగా అటూ ఇటూ పరుగులెడుతారు. ఆరోగ్యంపై ధ్యాస అవసరం. డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
సింహరాశి జాతకులకు చాలా అదృష్టం అని చెప్పాలి. మీ పెండింగు పనులు పూర్తవుతాయి. ప్రేమ జీవితంలో మాత్రం ఆందోళన ఉంటుంది. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునేవారికి మంచి సమయం.
కన్యారాశి జాతకులకు పదవ పాదం కారణంగా ఈ సమయం అత్యంత శుభసూచకం. దీర్ఘకాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
తుల రాశి జాతకులకు మంగళ గ్రహం గోచారం కారణంగా ఎగుడు దిగుడు పరిస్థితులు తలెత్తుతాయి. మీ పనుల్లో ఆటంకాలు ఎదురౌతాయి. అపరిచితులు మీకు తోడుగా ఉంటారు. ఉన్నత విద్యకు ఇది అనువైన సమయం.
వృశ్చికరాశి జాతకులకు అష్టమపాదంలో ఉంటుంది. మీ ఆరోగ్యంపై ధ్యాస అవసరం. ప్రమాదాలు, గాయాలు ఉండవచ్చు. పనిచేసే చోట ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనుకోని ఘటన ఏదైనా జరగవచ్చు.
ధనస్సు రాశి జాతకులకు మంగళ గ్రహ గోచారం కారణంగా పెళ్లైనవారి జీవితంపై ప్రభావముంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులుంటాయి. రానున్న 45 రోజులు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త వ్యాపారాలు ప్రారంభించవద్దు.
మకర రాశి జాతకులకు మంగళ గ్రహం గోచారం శుభ ఫలాలనిస్తుంది. ఉరుకులు పరుగులతో చేసే పనుల్లో విజయం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఖర్చులు మాత్రం పెరుగుతాయి. అయితే ఖర్చులేవీ అనవసరం కావు. సంబంధాలు మెరుగుపడతాయి.
కుంభరాశి జాతకులకు 5వ పాదంలో మంగళ గ్రహం గోచారముంటుంది. ఈ రాశి జాతకులు కష్టాల్ని ఎదుర్కోవల్సివస్తుంది. ప్రేమ జీవితంలో ఇబ్బందులు ఎదురౌతాయి. నోరు అదుపులో ఉంచుకోవాలి. కొత్తవారితో పరిచయం లాభాన్ని కల్గిస్తుంది.
మీనరాశి జాతకులకు మంగళ గ్రహం గోచారం నాలుగవ పాదంలో ఉంటుంది. దీంతో కుటుంబంలో విభేదాలు రావచ్చు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
Also read: Shukra Gochar 2023: మేషరాశిలో సంచరించిన శుక్రుడు... ఈ 5 రాశులకు బంపర్ బెనిఫిట్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook