Mars Transit 2022: మంగళ గ్రహ గోచారం ప్రభావం మూడు రాశుల అదృష్టాన్ని మార్చుతోంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అంతులేని సంపదను తెచ్చిపెట్టనుంది.
గ్రహాల రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. కొన్నింటిపై అనుకూలంగా, మరి కొన్నింటిపై ప్రతికూలంగా ఉండనుంది. మంగళ గ్రహం అక్టోబర్ 10 వరకూ వృషభ రాశిలో ఉండటంతో..మూడు రాశుల అదృష్టం పూర్తిగా మారిపోనుంది. రానున్న 25 రోజులు అంతులేని సంపద కలగనుంది. అంతలా అదృష్టం మారనున్న ఆ రాశులేంటో చూద్దాం..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో గోచారం, వక్రమార్గం పడతాయి. ఆ ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. ఆగస్టు 10వ తేదీన మంగళ గ్రహం వృషభ రాశిలో ప్రవేశించాడు. అక్టోబర్ 10వ తేదీ వరకూ అదే రాశిలో ఉంటాడు. మంగళ గ్రహం గోచారం కారణంగా అన్ని రాశులపై అనుకూల, ప్రతికూల ప్రభావం పడనుంది. కానీ మూడు రాశులు వృశ్చికం, సింహం, కన్యా రాశుల అదృష్టం పూర్తిగా మారిపోతోంది. రానున్న 25 రోజుల పాటు ఈ మూడు రాశులకు తిరుగే ఉండదు.
వృశ్చిక రాశి జాతకులకు మంగళ గ్రహం గోచారం కారణంగా అంతులేని లాభాలు కలగనున్నాయి. మంగళ గ్రహం గోచారం వల్ల ఈ రాశి కుండలిలో రాజయోగం ఏర్పడనుంది. ఫలితంగా ఆదాయం అమాంతం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. ఆర్ధిక సమస్యలు దూరమౌతాయి. ఈ రాశి జాతకుల పనులు వేగవంతమౌతాయి. పనిచేసే చోట ప్రశంసలు లభిస్తాయి.
సింహరాశి జాతకులపై మంగళ గ్రహ గోచారం ప్రభావం పూర్తిగా శుభ సూచకంగా ఉండనుంది. రానున్న 25 రోజులు ఈ రాశి జాతకులకు గోల్డెన్ డేస్‌గా చెప్పవచ్చు. ఉద్యోగస్థులకు పదోన్నతులు కలుగుతాయి. దాంతోపాటు ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలున్నాయి. అటు వ్యాపారంలో కూడా అభివృద్ధి కలగనుంది.
కన్యారాశి జాతకులకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. నిలిచిపోయిన చాలా పనులు పూర్తవుతాయి. వ్యాపార విషయమై ప్రయాణాలుంటాయి. అవి భవిష్యత్తులో లాభదాయకంగా ఉంటాయి. విద్యార్ధులకు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook