Mangal Rise In Sagittarius 2024: గ్రహాలు నిర్ధిష్ట సమయం తర్వాత రాశులను మారుస్తాయి. ఇటీవల గ్రహాల కమాండరైన అంగారకుడు ధనస్సు రాశిలో ఉదయించాడు. జ్యోతిష్యశాస్త్రంలో కుజుడుని ధైర్యం, భూమి మరియు శౌర్యానికి ప్రతీకగా భావిస్తారు. ధనుస్సు రాశిలో కుజుడు ఉదయించడం వల్ల నాలుగు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
అంగారకుడు ఉదయం ఈ 3 రాశులకు వరం
మిథున రాశి
ధనుస్సు రాశిలో కుజుడు ఉదయించడం వల్ల మిథునరాశి వారు బోలెడు బెనిఫిట్స్ పొందుతారు. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీరు ఉద్యోగ మరియు వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీకు ఉద్యోగం వస్తుంది. ఆగిపోయిన ప్రమోషన్ మీకు వస్తుంది.
సింహరాశి
అంగారకుడు ఉదయించడం వల్ల మీ సంపద విపరీతంగా పెరుగుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు లాభిస్తాయి. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ దారిద్ర్యం తొలగిపోతుంది. మీకు సుఖప్రాప్తి కలుగుతుంది.
కుంభ రాశి
కుజుడు కదలికలో మార్పు వల్ల కుంభరాశి వారి కోరికలు నెరవేరుతాయి. మీకు కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది. మీరు డబ్బును భారీగా పొదుపు చేస్తారు. మీరు లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.
Also Read: Budh Shani Yuti 2024: 30 ఏళ్ల తర్వాత కుంభంలో బుధుడు-శని సంయోగం..ఈ 4 రాశులకు లాటరీ ఖాయం..
Also Read: Trigrah yog: ధనుస్సు రాశిలో త్రిగ్రహ యోగం.. ఈ 3 రాశుల వారిపై కనక వర్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter