Mangal Gochar 2022: కుజుడి సంచారం.. రాబోయే 4 నెలలు ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండకపోతే నష్టం..

Mangal Gochar 2022:  కుజుడు రాశి మార్పు అన్ని రాశుల జీవితాలపై మంచి మరియు చెడు ప్రభావాలను చూపుతుంది. వృషభరాశిలో కుజుడు ఉండటం వల్ల ఏ రాశిచక్రం మీద ప్రతికూల ప్రభావం పడుతుందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2022, 12:31 PM IST
  • వృషభరాశిలో అంగారక సంచారం
  • ఈ రాశులపై ప్రతికూల ప్రభావం
  • ఇందులో మీరున్నారా మరి
Mangal Gochar 2022: కుజుడి సంచారం.. రాబోయే 4 నెలలు ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండకపోతే నష్టం..

Mangal Gochar 2022:  జ్యోతిష్యంలో గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనది. రీసెంట్ గా అంగారకుడు వృషభరాశిలో సంచరించాడు. 5 నెలలపాటు అంటే మార్చి 13 వరకు కుజుడు అదే రాశిలో ఉండనున్నాడు. ధైర్యం మరియు శక్తికి కారకుడైన అంగారకుడి సంచారం (Mangal Gochar 2022) కొన్ని రాశులకు శుభప్రదంగానూ, మరికొందరికి ప్రతికూలంగానూ ఉంటుంది. అంగారక గ్రహ సంచారంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. 

మేషరాశి (Aries): కుజుడు సంచారం వల్ల మేష రాశి వారికి ధన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం మానుకోండి. కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. ఈ సంచార ప్రభావం వల్ల మేష రాశి ఆరోగ్యంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. బయట పుడ్ తినడం మానేయండి. వ్యాయామంపై దృష్టి పెట్టండి. 
మిధునరాశి (Gemini): ఈరాశివారి సంచారం సమయంలో మీ తోబుట్టువులతో సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది. మీ శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. తీర్థయాత్రలకు వెళ్లాలనుకునేవారు అప్రమత్తతో వ్యవహారించడం మంచిది. వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. మీ స్నేహితులతో గొడవలు రావచ్చు. 

కన్య (Virgo): కన్యా రాశి వారు కుజుడు సంచార సమయంలో చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో మీ ప్రమోషన్ ఆగిపోతుంది. ఇతరులతో సంబంధాలు దెబ్బతింటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి. మెుత్తానికి ఈ సమయం మీకు అననుకూలంగా ఉంటుంది. 
వృశ్చికరాశి (Scorpio): అంగారక సంచారం కారణంగా మీ వైవాహిక జీవితంలో సమస్యలు  తలెత్తుతాయి. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు  అనుకూలించవు. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. పనులు పూర్తికావు. మెుత్తానికి ఈ సమయం మీకు అంతగా అనుకూలించకపోవచ్చు.

Also Read: Chaturgrahi Yog 2022: వృశ్చికరాశిలో అరుదైన యోగం.. ఈ 3 రాశుల కెరీర్ అద్భుతం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News