Mangal and Budh Gochar 2023: ఈ నెల 10న ఖగోళం కీలక పరిణామం చోటుచేసుకోనుంది. పెద్ద గ్రహాలైన మార్స్ మరియు మెర్క్యూరీ గమనంలో పెను మార్పు రాబోతుంది. అంగారకుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి.. జూలై 01 వరకు అక్కడే ఉంటాడు. అనంతరం సూర్యుడి రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. మరోవైపు గ్రహాలు యువరాజుగా పిలువబడే బుధుడు అదే రోజున మేషరాశిలో ఉదయిస్తాడు. ఈ రెండు ప్రధాన గ్రహాల సంచారం వల్ల నాలుగు రాశులవారి జీవితాల్లో వెలుగులు నింపనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
వృషభం: అంగారకుడి సంచారం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. ప్రత్యర్థులు మీపై విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. పని లేదా వ్యాపార నిమిత్తం మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంది. అనవసర చర్చలకు దూరంగా ఉండండి.
సింహం : కుజుడు రాశి మార్పు వల్ల విదేశాల్లో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. కోర్టు కేసుల్లో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు పని నిమిత్తం బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి.
కన్య: కుజుడు బుధుడు సంచారం వల్ల మీరు ఆర్థికంగా లాభపడాతరు. మీ ప్రణాళికలన్నీ నెరవేరుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అపారమైన పురోగతిని సాధిస్తారు. మీరు మీ స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంది. మీరు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి.
కుంభం: బుధుడు ఉదయించడం వల్ల మీ పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా మీకు ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ మరియు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు బిజినెస్ కోసం బయటకు వెళ్లే అవకాశం ఉంది. మీ ఖర్చులు స్వల్పంగా పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.
(నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించలేదు.)
Also Read: Shukra Gochar 2023: మే 30 వరకు ఈ రాశులపై డబ్బు వర్షం.. మీది ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook