Maha Ashtami 2023: 700 ఏళ్ల తర్వాత దుర్గాష్టమి నాడు మహా అద్భుతం.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం..

Ashtami 2023 Shubh Yog: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ చైత్ర నవరాత్రుల మహా అష్టమి నాడు 700 సంవత్సరాల తర్వాత అరుదైన గ్రహ కలయిక జరుగుతోంది. ఈ కలయిక 3 రాశుల వారికి వారి ఉద్యోగం మరియు వ్యాపారంలో పురోగతిని ఇస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 27, 2023, 03:17 PM IST
Maha Ashtami 2023: 700 ఏళ్ల తర్వాత దుర్గాష్టమి నాడు మహా అద్భుతం.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం..

Durlabh Sanyog on Maha Ashtami 2023: చైత్ర నవరాత్రులు మరో మూడు రోజుల్లో ముగియనున్నాయి. ఈ నవరాత్రుల్లో అష్టమి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మహా అష్టమి నాడు 700 ఏళ్ల తర్వాత అరుదైన గ్రహాల కలయిక జరుగబోతుంది. ఇది అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. మరో రెండు రోజుల్లో అంటే మార్చి 29న ఏర్పడబోతున్న ఈ అష్టమి నాడు గురుడు తన సొంత రాశి అయిన మీనరాశిలోనూ, శనిదేవుడు తన స్వరాశి అయిన కుంభరాశిలోనూ, శుక్రుడు మరియు రాహువు మేషరాశిలోనూ, బుధుడు మీనరాశిలోనూ సంచరించనున్నారు. ఈ గ్రహాలన్నీ కలిసి 5 శుభయోగాలను సృష్టిస్తున్నాయి. నవరాత్రుల అష్టమి ఏ రాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం.

కర్కాటకం: నవరాత్రుల అష్టమి నాడు ఏర్పడే 5 మహాయోగాల అరుదైన కలయిక మీకు ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వనుంది. మీ సంపద రెట్టింపు అవుతుంది. మీరు ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీపై శని ధైయా కొనసాగుతున్నప్పటికీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. 
మిథునం: దుర్గాష్టమి మిథునరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మిథున రాశి వారి అదృష్టం ప్రకాశిస్తుంది. మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 
మకరం: మకర రాశి వారు మంచి ఫలితాలను సాధిస్తారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. 

Also Read: surya grahan 2023: సూర్యగ్రహణంతో ఈ రాశులకు మహార్దశ... ఇందులో మీ రాశి ఉందా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News