Krishna Janmashtami 2023: ద్వాపర యుగంలో ఏర్పడిన ప్రత్యేక యోగం, మళ్లీ ఈ కృష్ణాష్టమి రోజున రాబోతోంది..ఈ 3 రాశుల వారికి ఊహించని లాభాలు!

Krishna Janmashtami 2023: కృష్ణాష్టమి రోజున ప్రత్యేక యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం కారణంగా మూడు రాశుల వారు అఖండ విజయాలు సాధించబోతున్నారని వారంటున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 6, 2023, 07:42 PM IST
Krishna Janmashtami 2023: ద్వాపర యుగంలో ఏర్పడిన ప్రత్యేక యోగం, మళ్లీ ఈ కృష్ణాష్టమి రోజున రాబోతోంది..ఈ 3 రాశుల వారికి ఊహించని లాభాలు!

 

Krishna Janmashtami 2023: దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం శ్రీకృష్ణుడు జన్మించిన రోజున కృష్ణాష్టమి పండగను జరుపుకుంటారు. ఈ పండగలో భాగంగా శ్రీకృష్ణుని భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసాలు పాటిస్తారు. అయితే ఈ సంవత్సరం పండగ అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో వచ్చింది. దీంతో చంద్రుడు కూడా తన రాశిలోనే ఉచ్చ స్థితిలో ఉన్నాడు. దీనికి కారణంగా జయంతి ప్రత్యేక యోగం ఏర్పడిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి యోగం సరిగ్గా ద్వాపర యుగంలో ఏర్పడిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం జన్మాష్టమి కొన్ని రాశుల వారికి ఫలప్రదంగా ఉంటుందని వారు అంటున్నారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడి అదృష్టం రెట్టింపు అవుతుందని..దీని కారణంగా ఆర్థికంగా అనేక రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. 

ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం ప్రభావం:
వృషభ రాశి:

కృష్ణాష్టమి సందర్భంగా వృషభ రాశి వారికి ఈ సమయం చాలా ఫలప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శ్రీకృష్ణుడి అనుగ్రహం లభించి ఈ రాశి వారు అనుకున్న పనులు సులభంగా సాధిస్తారు అంతేకాకుండా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈరోజు ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు కుటుంబంలో సుఖ శాంతులు కలగడమే కాకుండా శ్రేయస్సు కూడా పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కృష్ణుడి అనుగ్రహంతో మీ జీవిత భాగస్వామి పూర్తి మద్దతు లభించి మీకు తోడుగా అన్ని పనుల్లో నిలుస్తుంది. 

సింహ రాశి:
సింహరాశి వారిపై కూడా ప్రత్యేక యోగ ప్రభావం పడబోతోంది దీని కారణంగా శ్రీకృష్ణుడి అనుగ్రహం లభించి కష్టాలన్నీ గట్టెకుతాయి. దీంతోపాటు డబ్బులు సంపాదించడానికి కొత్త మార్గాలు కూడా వాటంతకవే ఏర్పడతాయి. ఈ సమయంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారని..దీంతోపాటు భవిష్యత్తులో కూడా పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మీ పిల్లల నుంచి కూడా ఈ సమయంలో శుభవార్తలు వింటారు. కుటుంబంతో కలిసి టూర్లకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

కర్కాటక రాశి :
కర్కాటక రాశి వారికి కూడా కృష్ణుడి అనుగ్రహం లభించి అఖండ విజయాలు సాధిస్తారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వ్యాపారాలు మొదలుపెట్టేవారు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారు. ఇక వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయం కలిసి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కుటుంబంతో కలిసి ఈ రాశి వారు ఎంతో ఆనందంగా ఉంటారు. అంతేకాకుండా ఖర్చులు తగ్గి ఆదాయాలు పెరగడం కారణంగా సంపద కూడా రెట్టింపు అవుతుంది. సమాజం కోసం పనిచేసే వారికి గొప్ప ప్రశంసలు లభిస్తాయి. అంతేకాకుండా మీపై మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీనికి కారణంగా ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు.

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News