Guru Vakri Effect: త్వరలో గురుడు తిరోగమనం... ఈ మూడు రాశులవారికి లాభం!

Guru Vakri 2022 Effect:  బృహస్పతి తన రాశిని మార్చబోతున్నాడు. గురుడు సంచారం వల్ల మూడు రాశులు వారు లాభపడనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 8, 2022, 03:15 PM IST
  • తిరోగమించినున్న గురుడు
  • ఈ రాశులు వారికి అదృష్టం
Guru Vakri Effect: త్వరలో గురుడు తిరోగమనం... ఈ మూడు రాశులవారికి లాభం!

Jupiter Retrograde Effect: జ్యోతిష్యశాస్త్రంలో జ్ఞానం, విద్య, అదృష్టానికి చిహ్నాంగా బృహస్పతి గ్రహాన్ని భావిస్తారు. ప్రస్తుతం బృహస్పతి తన సొంత రాశి అయిన మీనంలో (Jupiter Retrograde In Pisces 2022) ఉన్నాడు. ఈ నెల 29న గురుడు అదే రాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. తిరోగమన గురువు సంచారం మెుత్తం 12 రాశులను ప్రభావితం చేస్తాడు. అంతేకాకుండా మూడు రాశులవారికి అపారమైన ప్రయోజనాలను ఇవ్వనున్నాడు. ఆ రాశులేంటో చూద్దాం. 

వృషభం (Taurus) - మీనంలో బృహస్పతి తిరోగమనం వృషభ రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. వారి ఆదాయం పెరుగుతుంది. కొత్త జాబ్ వస్తుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు కలిగి ఉంటారు. వ్యాపారులు భారీగా సంపాదిస్తారు. విద్యారంగంతో అనుబంధం ఉన్నవారు అధికంగా లాభపడతారు.  

మిథునరాశి (Gemini)- గురుడు తిరోగమన కదలిక మిథున రాశి వారికి చాలా మేలు చేస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో లాభపడతారు. మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు లాభాలు గడిస్తారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. మెుత్తం మీద ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంటుంది. 

కర్కాటక రాశి (Cancer)- తిరోగమన గురువు కర్కాటక రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. వీరికి అదృష్టం మెండుగా ఉంటుంది. ఈ కాలంలో ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారులు లాభపడతారు. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. వీరు కెరీర్ అద్భుతంగా ఉంటుంది.  

Also Read: Devshayani Ekadashi 2022: దేవశయని ఏకాదశి వ్రతం ఇలా చేస్తే... ఇంటి నిండా ఐశ్వర్యమే..!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News