Guru Chandal Yog Ends in October 2023: అక్టోబరు 30న ముగియనున్న గురు చండాల యోగం.. అప్పటి వరికి ఈ 5 రాశుల వారు తస్మాత్ జాగ్రత్త

Guru Gochar 2023: మేష రాశిలో రాహువు, గురు కలయిక వల్ల గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని అశుభకరమైనదిగా భావిస్తారు. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోనున్నారో తెలుసుకుందాం.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 8, 2023, 12:30 PM IST
Guru Chandal Yog Ends in October 2023: అక్టోబరు 30న ముగియనున్న గురు చండాల యోగం.. అప్పటి వరికి ఈ 5 రాశుల వారు తస్మాత్ జాగ్రత్త

Jupiter Rahu conjunction 2023 makes Guru Chandal Yog: ప్రస్తుతం దేవగురు బృహస్పతి మేషరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కూడా ఇదే రాశిలో గోచరిస్తున్నాడు. మేషరాశిలో గురు రాహువు కలయిక వల్ల గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఈ యోగం అక్టోబరు 30న ముగియనుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని అశుభకరమైనదిగా భావిస్తారు. దీని వల్ల కొన్ని రాశులవారు చాలా సమస్యలను ఎదుర్కోనున్నారు. గురు చండాల యోగం వల్ల ఏ రాశుల వారిపై చెడు ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. 

మేషరాశి
ఈ రాశిలోనే గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు మోసపోయే అవకాశం ఉంది. మీరు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ఉద్యోగులు, వ్యాపారులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అక్టోబరు 30 వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. 
మిధునరాశి
మిథున రాశి వారి జాతకంలోని 11వ ఇంట్లో గురు చండాల యోగం ఏర్పడింది. దీంతో మీరు చాలా డబ్బు నష్టపోతారు. మీ వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు రావచ్చు. మిమ్మల్ని అనేక సమస్యలు చుట్టుముడతాయి. ఉద్యోగులు చాలా అవమానాలను ఎదుర్కోంటారు. 
కన్య రాశి
ఈ అశుభకర యోగం ఎనిమిదో ఇంట్లో ఏర్పడుతుంది. మీ దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మీకు ఖర్చులతోపాటు కష్టాలు కూడా పెరుగుతాయి. మీకు యాక్సిడెంట్ జరగవచ్చు కూడా. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది.

Also Read: Shukra Gochar 2023: కర్కాటక రాశిలో ధన రాజయోగం.. ఈ 4 రాశులవారిపై డబ్బు వర్షం..

ధనుస్సు రాశి
గురు చండాల యోగం ధనస్సు రాశి వారి ఐదవ ఇంట్లో ఏర్పడుతుంది. ఇది మీ కుటుంబ సంబంధాలను ప్రభావితం చేస్తుంది. మీరు చాలా డిప్రెషన్ కు గురవుతారు. ఈ సమయంలో మీరు ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోండి.
మీనరాశి
ఈ రాశి యెుక్క రెండో ఇంట్లో గురు చండాల యోగం సృష్టించబడుతుంది. మీ కుటుంబాలు గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీ కెరీర్లో అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ సమయంలో మీ మాటలను అదుపులో ఉంచుకుంటే మంచిది. 

Also Read: Budhaditya Rajyog: మరో 3 రోజుల్లో ఈ 3 రాశుల సుడి తిరగబోతుంది.. మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U.

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News