June 2022 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో పలు రాశుల వారికి 17వ తేదీ తర్వాత ప్రభావవంతమైన ఫలితాలు ఉంటాయి. అవి ప్రతికూలంగా ఉండొచ్చు లేదా సానుకూలంగా ఉండొచ్చు. ఆయా వ్యక్తుల జాతకం ప్రకారం కొన్ని పనులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. కొన్ని రాశుల వారిని ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. జూన్ నెలలో ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో... పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
మేషరాశి ( Aries)
మేష రాశి వారు ఈ నెలలో కాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అలాగే, సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. వ్యాపారాన్ని సరైన దిశలో తీసుకెళ్లేందుకు అవసరమైన వ్యూహాలు అమలుచేస్తారు. జూన్ 19 వరకు గ్రహాల స్థానాలు అనుకూలంగా ఉన్నాయి. యువత విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశాలు ఉన్నాయి. మీ ఆలోచనలు, పనులు కుటుంబంలో ఎవరినీ బాధపెట్టకూడదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. నెల ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. తల, కళ్ళ సమస్యలు బాధిస్తాయి. అలాగే నిద్రలేమితో బాధపడుతారు. సమాజంలో గౌరవం, గుర్తింపు కోసం దానధర్మాలు చేస్తారు.
వృషభ రాశి (Taurus)
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారు ఈసారి లాభాలు పొందుతారు. అయితే జూన్ 17 తేదీ తర్వాత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. యువత తమ లక్ష్యాల ప్రాతిపదికన ప్రణాళికాబద్ధంగా పని చేయాలి. స్నేహితులతో ఏదైనా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తే.. దానిని అమలు చేయాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ, ప్రియమైనవారి సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. గ్రహాల స్థానాల కారణంగా మీకు ప్రియమైన వ్యక్తులతో మనస్పర్థలు తలెత్తవచ్చు. ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. గోశాలకు వెళ్లి ఆవుకు కనీసం ఒక వారం మేత ఏర్పాటు చేయండి. తద్వారా పెండింగ్ పనులు చకచకా పూర్తవుతాయి.
మిథున రాశి (GEMINI)
మిథునరాశి రాశి వారు పెండింగ్‌లో ఉన్న పాత పనులను పూర్తి చేస్తారు. జూన్ 17 తర్వాత హోటళ్లు, రెస్టారెంట్లు, స్టేషనరీ వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ప్రభుత్వ పనుల్లో అనవసర వివాదాల జోలికి వెళ్లకండి. ఈ నెలలో మరింత శక్తి, సామర్థ్యాలతో పనిచేస్తారు. కోపాన్ని కాస్త అదుపులో ఉంచుకోవాలి. చీటికి మాటికి కోపం తెచ్చుకోవడం తగదు. కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ నెలలో అగ్ని ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శారీరక అనారోగ్యాన్ని మానసిక అనారోగ్యంగా మార్చవద్దు. లేనిపక్షంలో కోలుకోవడానికి చాలా సమయం పట్టవచ్చు.
కర్కాటక రాశి (Cancer)
ఈ రాశి వారికి మహిళా సహోద్యోగులతో సమన్వయం అవసరం. సాఫ్ట్‌వేర్ కంపెనీలలో పనిచేసే వారికి ఈ నెల 17వ తేదీలోగా ప్రమోషన్‌లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విషయాలలో, సీనియర్ల సాంగత్యం మిమ్మల్ని వ్యాపార లాభాల వైపు నడిపిస్తుంది. 20వ తేదీ వరకు కష్టపడే తత్వం నుంచి వెనకడుగు వేయవద్దు. నెల ప్రారంభంలో అనవసరమైన ఆందోళనలు ఇబ్బంది పెడుతాయి. ఇంటి పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టడం కూడా చాలా ముఖ్యం. పూర్వీకుల ఆశీస్సులు మాత్రమే మిమ్మల్ని అన్ని కష్టాల నుండి దూరం చేస్తాయి. ఈ నెలలో మలబద్ధక సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతారు. మీ డైట్‌లో ముతక ధాన్యాలు, ఫైబర్ అధికంగా ఉండే వాటిని తీసుకోండి.
సింహ రాశి (LEO)
సింహ రాశి వ్యక్తులు ఈ నెల ప్రారంభం నుంచి యజమానితో వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వ్యక్తులు విజయం సాధిస్తారు. వ్యాపారవేత్తలు, టెలికమ్యూనికేషన్, ఫ్యాషన్ రంగంలో మంచి లాభాలను పొందుతారు. జూన్ 10 వరకు పెండింగ్ పనులను కూడా పూర్తి చేస్తారు. యువత ప్రవర్తనలో ఎక్కువ సీరియస్‌నెస్ పనికిరాదు. కాస్త నవ్వు కూడా ఉండాలి. ఇంటి పెద్దకు గౌరవం ఇవ్వాలి. ఆయన తీసుకునే నిర్ణయం అందరి ప్రయోజనాలను, అందరికి అనుకూలంగా ఉంటుంది. కడుపులో అల్సర్లకు సంబంధించిన వ్యాధులు ఇబ్బందిపెడుతాయి. కారం, మసాలాలు, వేయించిన వస్తువులకు దూరంగా ఉండాలి. ఈ నెలలో సామాజికంగా ఎక్కువ సమయం గడపలేరు.
కన్య రాశి (Virgo)
ఈ రాశి వారికి శ్రమ ఆధారంగానే ఫలితాలు ఉంటాయి. కష్టపడి ముందుకు సాగితే అంతా బాగుంటుంది. మీరు పూర్వీకుల వ్యాపారం చేస్తున్నట్లయితే, మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది, తండ్రి సహాయంతో, లాభం పొందే పరిస్థితి ఉంటుంది. యువత స్నేహితులతో వివాదాలు పెట్టుకోకూడదు, అనవసర వివాదాలు పరస్పర సంబంధాలను చెడగొడతాయి, దానికి దూరంగా ఉండాలి. మొత్తానికి పెరిగే అవకాశం ఉంది, మాసం మధ్యలో పితృ పురోభివృద్ధి ఏర్పడుతుంది. శరీరం కింది భాగంలో సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా కాలేయం మరియు మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండండి. సామాజిక రంగంలో, ప్రసంగంపై సంయమనం పాటించండి ఎందుకంటే అది మీ సామాజిక పనిని చేయగలదు లేదా విచ్ఛిన్నం చేయగలదు.
తులా రాశి (Libra)
తుల రాశి వ్యక్తులు సృజనాత్మక పనులకు ప్రాధాన్యత ఇస్తారు, అలాగే కొత్త పరిశోధనలు మరియు పనికి కొత్త దిశను అందించడానికి కృషి చేస్తారు. నెలారంభంలో కాస్త ఓపిక అవసరం. ఆ తర్వాత ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్లాలి. యువత ఆలోచనాత్మకంగా స్నేహం చేయాలి. జూన్ 17వ తేదీ వరకు ప్రతికూల ధోరణులకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి షుగర్ పేషెంట్ అయితే, ఈ నెలలో అప్రమత్తంగా ఉండాలి. ఆహార సమతుల్యత చాలా ముఖ్యం. అనారోగ్యంతో ఉన్నవారు ఉపశమనం పొందే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు పిండం యొక్క కదలికను ఎప్పటికప్పుడు గమనించాలి.
వృశ్చిక రాశి (Scorpio)
ఈ రాశి వారికి జూన్ 17 తర్వాత... పనిచేసే ఆఫీసులో బాస్ ఆశీస్సులు లభిస్తాయి.ఈ నెలలో ఇనుము వ్యాపారులకు పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక కోపం, వివాదాలను యువత నిశితంగా గమనించాలి. నెల మధ్యలో, కొంతమంది మిమ్మల్ని తప్పుదారిలో తీసుకెళ్లడానికి ప్రయత్నించవచ్చు. కుటుంబ విషయాలు చర్చించబడతాయి, గృహ సమస్యలు పెరిగితే, కోర్టును ఆశ్రయించవద్దు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోగలరు. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిపెడుతాయి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే అవకాశం చేజారనివ్వదు. తద్వారా చాలా పుణ్యం లభిస్తుందని గుర్తుంచుకోండి.
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశిలోని వ్యక్తులు ఉద్యోగ రంగంలో ఉన్నట్లయితే ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. వ్యాపార పెట్టుబడుల గురించి తొందరపడకండి. ఈ నెల 3 మూడవ వారంలో మంచి పెట్టుబడి అవకాశం వస్తుంది. యువత స్నేహితులతో కలిసి మతపరమైన ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. మతపరమైన ప్రయాణం మనసుకు సంతృప్తినిస్తుంది. పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ఆహారం, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే వైద్యుడిని సంప్రదించినప్పుడు వారు ఇచ్చిన సూచనలను పాటించాలి. సామాజిక చైతన్యం తప్పనిసరి.
మకర రాశి (Capricorn)
ఈ రాశి వారికి ఆఫీసు విషయంలో టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే పని ఒత్తిడి మీకు గుదిబండలా మారుతుంది. మార్బుల్, హార్డ్‌వేర్ వ్యాపారంలో ఉన్న వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మిగిలినవారికి సాదాసీదా ఫలితాలు ఉంటాయి. యువత ఇతరుల వివాదాల్లో తలదూర్చకూడదు. తోబుట్టువుల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి, వారి వైపు నుండి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. జంతువులు, పశుపక్షాదులకు మేత వేయండి. ఆపదలో ఉన్నవారు మీ సాయం కోరితే కాదనకండి.
కుంభ రాశి (Aquarius)
కుంభ రాశి వారికి ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతాయి. కార్యాలయంలో ఎవరితోనూ అహంభావ వివాదాలు ఉండకూడదు. ట్రేడింగ్‌లో పరిస్థితులు కొద్దిగా విరుద్ధంగా ఉండవచ్చు. విద్యార్థులు ఈ నెలలో బలహీనమైన సబ్జెక్టుపై ఎక్కువ ఫోకస్ చేయండి. తండ్రితో వివాదాలు వద్దు. అతని మార్గదర్శకాలను అనుసరించండి. కొన్ని పనుల్లో గందరగోళం వెంటాడుతుంది. కొన్ని వ్యాధులు ఇబ్బందిపెడుతాయి. కాబట్టి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. జూన్ 11 తర్వాత మీరు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఈ కార్యాచరణ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
మీన రాశి (Pisces)
ఈ రాశి వారు సృజనాత్మక పనులపై దృష్టి సారిస్తే లాభదాయకంగా ఉంటుంది, ఆఫీసులో మీరు ఇచ్చే సూచనలకు ప్రాముఖ్యత లభిస్తుంది. నెలారంభంలో 15 రోజులు ఒడిదుడుకులు తప్పవు. ఆ తర్వాత పరిస్థితులు మెరుగవుతాయి. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండండి. షాపింగ్ చేసేటప్పుడు అపవసర ఖర్చులు చేయవద్దు. తాతయ్యతో ఎక్కువ సమయం గడపండి. ఆయనకు అవసరమైన మందులు, వస్తువులు అందివ్వండి. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి.
Also Read: Nepal Plane Missing: నేపాల్‌లో విమానం మిస్సింగ్ విషాదాంతం..? పర్వత ప్రాంతంలో కూలిపోయినట్లు అనుమానాలు
Also Read: Tirumala Rush: తిరుమలలో రికార్డు స్థాయిలో పోటెత్తిన భక్తులు, బ్రేక్ దర్శనాలు రద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
June 2022 Horoscope: జూన్ నెల రాశి ఫలాలు... ఆ తేదీ తర్వాత ఈ రాశుల వారి జీవితంలో కీలక మార్పులు
జూన్ నెల రాశి ఫలాలు
జూన్ 17 తర్వాత ఆయా రాశుల వారి జీవితంలో కీలక మార్పులు
ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్నవారిపై ప్రభావం