ఇవాళ్టి మీ రాశిఫలాలు.. నవంబర్ 28న మీ జాతకం ఇలా ఉంటుంది.

గ్రహాల కదలికలు, రాశుల్ని పట్టి ఎప్పటికప్పుడు వివిధ వ్యక్తుల రాశిఫలాలుంటాయి. ఇవాళ మీ రాశిఫలాలు ఇలా ఉన్నాయి. చెక్ చేసుకోండి. ఆ రాశివారికైతే పూర్తిగా ప్రతికూల పరిస్థితులుంటాయి. అన్నీ ఇబ్బందులే. అవేంటో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 28, 2021, 08:58 AM IST
ఇవాళ్టి మీ రాశిఫలాలు.. నవంబర్ 28న మీ జాతకం ఇలా ఉంటుంది.

గ్రహాల కదలికలు, రాశుల్ని పట్టి ఎప్పటికప్పుడు వివిధ వ్యక్తుల రాశిఫలాలుంటాయి. ఇవాళ మీ రాశిఫలాలు ఇలా ఉన్నాయి. చెక్ చేసుకోండి. ఆ రాశివారికైతే పూర్తిగా ప్రతికూల పరిస్థితులుంటాయి. అన్నీ ఇబ్బందులే. అవేంటో తెలుసుకుందాం.

మేషరాశి (Aries):రాశివారికి ఇవాళ కీలకమైన పనుల్లో సమస్యలు తలెత్తుతాయి.. కొత్తగా అప్పులు చేయడంతో  ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువుల్నించి ఒత్తిడి అధికమౌతుంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువైనా..శారీరక సమస్యలు ప్రశాంతత చేకూర్చనివ్వవు. ఉద్యోగ, వ్యాపారాల్లో తీవ్ర ఒత్తిడి ఉంటుంది.  

వృషభరాశి ( Taurus): ఈ రాశివారికి అప్పులుంటాయి. శ్రమ పడినా ఫలితముండదు. ఎప్పటికప్పుడు పనులు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు చికాకు తెప్పిస్తాయి. మానసిక అశాంతి వెంటాడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. 

మిధునరాశి ( Gemini): ఈ రాశిలో పుట్టినవారికి పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఊహించని ధనలాభం ఉండటమే కాకుండా పోగొట్టుకున్న వస్తువులు దక్కుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. 

కర్కాటకరాశి ( Cancer): ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. ఇవాళ్టి పనుల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆర్ధికంగా ఇబ్బందులుంటాయి. కుటుంబసభ్యుల్నించి ఏదో విషయంలో ఒత్తిడి ఉంటుంది. ఆలయాల్ని సందర్శిస్తారు. ఆరోగ్యభంగం, వృత్తి, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి.

సింహరాశి (Leo): ఈ రాశివారికి పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. ఇవాళ మీరు ఊహించని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. విలువైన వస్తువులు సేకరించడం, విద్యావకాశాలు,ఉద్యోగ, వ్యాపారులు అన్నీ బాగుంటాయి. 

కన్యారాశి ( Virgo): ఇవాళ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. పనులు వాయిదా పడతాయి. ఆలోచన స్థిరంగా ఉండకపోవడంతో అన్నీ ప్రతికూలంగా ఉంటాయి. కుటుంబసభ్యులతో తగాదా తప్పదు. అనారోగ్య సమస్యలుంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో చికాకు ఉంటుంది. 

తులారాశి ( Libra): ఈ రాశివారికి పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉంటాయి. కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలుంటాయి.

వృశ్చికరాశి ( Scorpio): ఈ రాశివారికి పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉంటాయి. ఇవాళ విషయాలన్నీ కొత్తగా తెలుస్తాయి. ప్రతిభకు గుర్తింపు ఉంటుంది. ఆర్ధిక పరిస్థితులు బాగుంటాయి. అనుకున్న పనులు అమలు చేస్తారు.  ఉద్యోగ, వ్యాపారాల్లో మార్పు ఉంటుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius): ఇక ఈ రాశివారికి ఇవాళ పూర్తిగా ప్రతికూలంగా ఉంటుంది. ఇవాళ్టి పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. డబ్బు ఖర్చవుతుంది. కుటుంబసభ్యులు, మిత్రులతో మాటపట్టింపులుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు అధికమై..శ్రమ పెరుగుతుంది.  ఉద్యోగ, వ్యాపారాల్లో నిరుత్సాహముంటుంది.  

మకరరాశి ( Capricorn): ఈ రాశివారికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని ప్రత్యేకమైన సమస్యలు తలనొప్పిగా మారతాయి. శ్రమ ఎక్కువుంటుంది కానీ ఫలితం పెద్దగా ఉండదు. పనులు వాయిదా పడతాయి. దూర ప్రయాణాలు తప్పవు. కుటుంబసభ్యులతో తగాదా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రతికూల పరిస్థితులుంటాయి.

కుంభరాశి  ( Aquarius): ఈ రాశివారికి ఇవాళ అనుకూల పరిస్థితులుంటాయి. అప్పులు తీరిపోవడంతో ప్రశాంతత ఉంటుంది. కొత్త పరిచయాలుంటాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఇచ్చిన అప్పులు కూడా వసూలవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు చాలా బాగుంటాయి. 

మీనరాశి ( Pices): ఇవాళ ఈ రాశివారికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది.  మీరు పడ్డ కష్టం ఫలిస్తుంది. కొత్త పనులు సక్సెస్ అవుతాయి. సన్నిహితుల్నించి ధనరూపంలో లాభం చేకూరుతుంది. అటు మీ పలుకుబడి కూడా పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అనూకుల పరిస్థితులు ఏర్పడతాయి.

Also read: Horoscope Today: నేడు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News