Horoscope Today May 12 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారికి దగ్గరి బంధువు నుంచి శుభవార్త అందుతుంది...

Horoscope Today  May 12 2022:  నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారికి ఉద్యోగ రీత్యా మంచి ఫలితాలు ఉంటాయి. బాస్ నుంచి ప్రశంసలతో పాటు ప్రమోషన్ దక్కవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 12, 2022, 07:15 AM IST
  • నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారికి కలిసొస్తుంది
  • రోజంతా సంతోషకరంగా, సాఫీగా సాగుతుంది
  • కొన్ని రాశుల వారిని నిరాశ, నిస్పృహలు వెంటాడుతాయి
  • నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయంటే..
Horoscope Today May 12 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారికి దగ్గరి బంధువు నుంచి శుభవార్త అందుతుంది...

Horoscope Today May 12 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారికి ఇవాళ సంతోషకరంగా, సానుకూలంగా గడుస్తుంది. చేపట్టిన పనుల్లో, వ్యక్తిగత విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. కొన్ని రాశుల వారిని నిరాశ, నిస్పృహలు వెంటాడుతాయి. ఫలితంగా రోజంతా అసంతృప్తి వెంటాడుతుంది. ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.. 

మేషరాశి ( Aries)

ఆఫీసులో మీ పనితనం బాగుంటుంది. బాస్‌తో మీకు మంచి అనుబంధం ఏర్పడుతుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది. ఉద్యోగ రీత్యా ప్రమోషన్ దక్కే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నయమవుతాయి. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారామవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు కొత్తగా జాబ్‌లో చేరే అవకాశం ఉంటుంది.

వృషభ రాశి (Taurus)

జీవితం చాలా ఛాలెంజింగ్‌గా ఉన్నట్లు భావిస్తారు. కొన్ని సమస్యల నుంచి బయటపడేందుకు పెద్దల సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుంది. పిల్లల చదువులు మిమ్మల్ని కొంత విచారానికి గురిచేస్తాయి. పిల్లల చదువులకు సంబంధించి ప్రయాణాలు చేసే అవకాశం. పెట్టుబడులు పెట్టే ముందు దానిపై ముందస్తు ప్రచారం చేయకండి.

మిథున రాశి (GEMINI)

ఇవాళంతా నిరాశజనకంగా ఉంటుంది. ఒకరకమైన అసంతృప్తి మిమ్మల్ని వెంటాడుతుంది. మీ కృషికి తగిన ఫలితం పొందుతారు. కొత్త కాంట్రాక్టులపై సంతకాలు చేసేముందు జాగ్రత్తగా వ్యవహరించండి. స్థిరాస్తి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మీ అంతరంగాన్ని ఫాలో అవండి. ఆరోగ్యం బాగుంటుంది.

కర్కాటక రాశి (Cancer) 

సోషల్ గ్యాదరింగ్ లేదా ఫ్యామిలీ ఫంక్షన్లలో బిజీ బిజీగా గడుపుతారు. అది మీ నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేస్తుంది. వృత్తిపరంగా ఆకస్మిక ప్రయాణం చేస్తారు. తోబుట్టువులు, సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. పనిలో మీ కొలిగ్స్ సహాయ సహకారాలు లభిస్తాయి. మీ ఆత్మవిశ్వాసం ఉచ్ఛ స్థితిలో ఉంటుంది. ఎవరితో మాట్లాడినా సరే సంయమనం, ఓపిక అవసరమని గుర్తించండి. 

సింహ రాశి (LEO)

మీ దగ్గరి బంధువు నుంచి శుభవార్త వింటారు. ఇంటికి సంబంధించి కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. పిల్లలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఒక్కచోట చేరే అవకాశం ఉంటుంది. ఇంటి పునర్నిర్మాణ పనుల విషయంలో తర్జన భర్జన పడుతారు. బంధువుల్లో మీ పలుకుబడి పెరుగుతుంది.

కన్య రాశి (Virgo)
 

ఇవాళ ఆనందం మీ చుట్టే ఉంటుంది. రోజంతా ఆహ్లాదకరంగా, ఆనందంగా గడుస్తుంది. కొన్ని సంక్లిష్ట నిర్ణయాలు మీకు కలిసొస్తాయి. భవిష్యత్తులో లాభాలను తెచ్చి పెడుతాయి. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. తిండికి సంబంధించి కాస్త నియంత్రణ అవసరం. మీ తిండి అలవాట్లపై కాస్త దృష్టి పెట్టండి. లేనిపక్షంలో పొట్ట సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

తులా రాశి (Libra)

ఇవాళ మీకు అంతగా కలిసిరాదు. నిద్రలేమితో బాధపడుతారు. అది మీ మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అనవసర ఖర్చులు మీ సేవింగ్స్‌పై ప్రభావం చూపుతాయి. ప్రత్యర్థుల కుట్రలకు బాధితుడిగా మిగిలే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రత్యర్థులపై ఓ కన్నేసి ఉంచండి. 

వృశ్చిక రాశి (Scorpio)

ఇవాళంతా ఆనందమయమే. వృత్తిపరంగా త్వరితగతిన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు చాలా ప్రయోజనాలను కలిగిస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. తద్వారా సేవింగ్స్ పెరుగుతాయి. మీ పార్ట్‌నర్ సాయంతో కొత్త బిజినెస్ మొదలుపెడుతారు. అది భవిష్యత్తులో లాభాలు తీసుకొస్తుంది. మీ జీవిత భాగస్వామిని మరింత బాగా అర్థం చేసుకుంటారు. దాంతో ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది.

ధనుస్సు రాశి (Sagittarius)  

మీ ఆఫీస్ కార్యకలాపాల్లో బిజీగా గడుపుతారు. మానసికంగా అలసటకు గురవుతారు. కుటుంబానికి తగిన సమయం కేటాయించలేకపోతారు. పెద్దల ఆశీస్సులతో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభిస్తుంది. మేనేజర్స్ టాప్ మేనేజ్‌మెంట్‌కి ప్రమోట్ అవుతారు. 

మకర రాశి (Capricorn) 

మీకు అప్పగించిన పనిని బాధ్యాతయుతంగా చేస్తారు. సకాలంలో పని పూర్తి చేయడమే కాదు.. ప్రభావవంతంగా చేస్తారు. పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. స్వచ్చంద సంస్థలకు తోచిన సాయం చేస్తారు. ప్రేమికులు ఒకరి పట్ల ఒకరికి మరింత నమ్మకం ఏర్పడుతుంది. ప్రత్యర్థుల పట్ల ప్రేమికులు అప్రమత్తంగా ఉండాలి. 

కుంభ రాశి (Aquarius)

ఇవాళ మిమ్మల్ని అసంతృప్తి వెంటాడుతుంది. అది మీ పనిపై ప్రభావం చూపుతుంది. దాంతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయలేకపోతారు. వృత్తిపరంగా, కుటుంబ పరంగా మీ గౌరవం, ప్రతిష్ఠపై అది ప్రభావం చూపుతుంది. అడ్వెంచర్ టూర్స్‌కు దూరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి నిరాశే మిగులుతుంది.

మీన రాశి (Pisces) 

ఇవాళంతా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొత్త బిజినెస్ మొదలుపెడుతారు. ఆకస్మిక ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేస్తారు. మీ జీవిత భాగస్వామికి మీరంటే బాగా నమ్మకం కుదురుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. అనవసర వివాదాల్లో తలదూర్చవద్దు.

 

Also Read: SVP Twitter Review: ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సర్కారు వారి పాట'... ఇట్స్ మహేష్ వన్ మ్యాన్ షో..   

Also Read: CM Jagan Serious: అలా చేస్తే జిల్లా బహిష్కరణే..సీఎం జగన్ సంచలన నిర్ణయం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News