Horoscope Today May 11 2022: రాశి ఫలాలు.. ఇవాళ ఈ రాశుల వారికి ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి...

Horoscope Today  May 11 2022:  నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారికి ఆశాజనకంగా, మరికొన్ని రాశుల వారికి నిరాశజనకంగా గడుస్తుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2022, 08:40 AM IST
  • నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ మేష, వృషభ, కర్కాటక సింహ రాశుల వారికి సానుకూల ఫలితాలు
  • మిథున, తులా రాశుల వారికి ప్రతికూల ఫలితాలు
  • నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయంటే..
Horoscope Today May 11 2022: రాశి ఫలాలు.. ఇవాళ ఈ రాశుల వారికి ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి...

Horoscope Today May 11 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... మేష రాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, సింహ రాశి ఇలా తదితర రాశుల వారికి ఇవాళ శుభ ఫలితాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మిథున రాశి, తులా రాశి సహా మరికొన్ని రాశుల వారికి ఇవాళ కాస్త నిరాశజనకమైన ఫలితాలే ఉండే అవకాశం ఉంది. ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.. 

మేషరాశి ( Aries)

చంద్ర అనుగ్రహం మీపై ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కొన్నాళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు కుదుటపడుతాయి. మీకు రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. విలువైన వస్తువుల కొనుగోలుకై బ్యాంకు రుణాలకు దరఖాస్తు చేస్తారు. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.

వృషభ రాశి (Taurus)

ఇవాళ గురు గ్రహ అనుగ్రహం మీకు లభిస్తుంది. తద్వారా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్య విషయాల్లో ఆత్మవిశ్వాసంతో నిర్ణయం తీసుకుంటారు. వచ్చిన అవకాశాలను మరో ఆలోచన లేకుండా సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ సభ్యులు, మిత్రుల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. ప్రేమికులు సంతోషంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి... మిత్రుల సహాయంతో కోరుకున్న జాబ్ దొరకవచ్చు.

మిథున రాశి (GEMINI)

ఇవాళ మీరు చాలా నిరూత్సాహంగా కనిపిస్తారు. రోజంతా నిరాశజనకంగా గడుస్తుంది. అహంకారం విడనాడితే మంచిది. లేనిపక్షంలో అది మీ కుటుంబ జీవితంతో పాటు వృత్తిపరమైన జీవితంపై ప్రభావం చూపుతుంది. మీలో ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. అది మిమ్మల్ని సృజనాత్మకత వైపు వెళ్లకుండా చేస్తుంది. పెట్టుబడులకు కొన్నాళ్లు దూరంగా ఉంటే మంచిది. పెద్దల మాట వింటే కొన్ని విషయాల్లో నష్టం జరగకుండా ఉంటుంది. 

కర్కాటక రాశి (Cancer) 

ఇవాళ మీరు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. వృత్తిరీత్యా బాగా రాణిస్తారు. మీ కృషికి తగిన గుర్తింపు, ఫలితం దక్కుతాయి. అది మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. తోబుట్టువులతో స్థిరాస్తి తగాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ప్రభావశీలురైన వ్యక్తులతో పరిచయాలు కలిసొస్తాయి. అది మీ పలుకుబడిని మరింత పెంచుతుంది. 

సింహ రాశి (LEO)

చంద్ర అనుగ్రహంతో చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. రోజంతా ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి వాక్చాతుర్యం కలిసొస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్‌తో బిగ్ ఆర్డర్స్ పొందుతారు. కస్టమర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం ద్వారా వారి ఆదరణ చూరగొంటారు. కొలిగ్స్ సహాయంతో వ్యాపారంలో కష్టాల నుంచి బయటపడుతారు.

కన్య రాశి (Virgo)

వృత్తిరీత్యా మీరు చేపట్టిన పనిని ఆస్వాదిస్తారు. మీ జీవిత భాగస్వామితో రొమాంటిక్ క్షణాలను గడుపుతారు. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టేందుకు కొత్త స్ట్రాటజీలు అమలుచేయాలనుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి సానుకూల సమయం. ప్రేమికులు అనవసర విషయాలపై చర్చించి మనస్పర్థలు తెచ్చుకోవద్దు. 

తులా రాశి (Libra)

ఇవాళ నిరాశజనకమైన ఫలితాలే ఎదురవుతాయి. మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. లేనిపక్షంలో నష్టాలను కొని తెచ్చుకున్నవారవుతారు. ప్రేమికులు ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచీ తూచీ మాట్లాడాలి. అనవసరంగా నోరు పారేసుకుంటే అది ప్రేమ బంధంపై ప్రభావం చూపుతుంది. ప్రేమ విషయంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. 

వృశ్చిక రాశి (Scorpio)

ఇవాళ మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతారు. అందుకు తగినట్లే రాబడి కూడా ఉంటుంది. మీ ఆదాయం మీ బ్యాంకు బ్యాలెన్స్‌ను పెంచుతుంది. కుటుంబంలో సుఖ, సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం, ఆర్థిక పురోగతి బాగుంటుంది. విద్యార్థులకు కర్మ ఫలితం బాగుంటుంది. చదువుల్లో రాణిస్తారు.

ధనుస్సు రాశి (Sagittarius)  

ఇవాళ మీరు చాలా సంతోషంగా గడుపుతారు. వ్యాపారం లాభాలు తీసుకొస్తుంది. మీ సీనియర్లు మీ పనిని అభినందిస్తారు. వృత్తి రీత్యా కొత్త బాధ్యతలు చేపడుతారు. ప్రమోషన్ దక్కే అవకాశం ఉంటుంది. మీ ప్రత్యర్థులు ప్రస్తుతం మీ జోలికి రారు. ప్రేమికులు స్నేహితులు లేదా బంధువుల సహాయంతో ప్రేమ పెళ్లి విషయంలో ముందడుగు వేస్తారు. 

మకర రాశి (Capricorn) 

ఇవాళ పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత, సంతృప్తి కలుగుతుంది. విదేశాలకు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగ రీత్యా మీ నెట్‌వర్క్ మీకు బాగా కలిసొస్తుంది. మీలో సృజనాత్మకత మరింత పెరుగుతుంది. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి సినిమాలకు వెళ్తారు. లేదా మరేదైనా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభ రాశి (Aquarius)

ఆర్థిక పురోగతి బాగుంటుంది. ఖర్చులకు, ఆదాయానికి మధ్య తగిన బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు. అది మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను పెంచుతుంది. ఉద్యోగ రీత్యా మీ పెర్ఫామెన్స్ బాగుంటుంది. మీ బాస్ పనిని అభినందించడమే కాదు ప్రమోషన్ రూపంలో కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. మీ నుంచి అప్పు తీసుకున్నవారు తిరిగి చెల్లిస్తారు. ఆరోగ్యం అన్ని విధాలా బాగుంటుంది. 

మీన రాశి (Pisces) 

ఇంటికి సంబంధించిన మరమత్తులు చేపడుతారు. ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా డెకరేట్ చేస్తారు. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. మిత్రులు, కొలిగ్స్‌తో వివాదాలు పరిష్కారమవుతాయి. కొన్ని వివాదాలకు సంబంధించి సానుకూలమైన వార్త వింటారు.

Also Read: Cyclone Asani: కాకినాడ, విశాఖ పోర్టులకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్... 

Also Read: Narayana Bail: మాజీ మంత్రి నారాయణకు ఊరట... పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బెయిల్...  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News