Today Horoscope March 18 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు చేయని పొరపాటుకు శిక్ష అనుభవిస్తారు!!

March 18 2022, Daily Horoscope. తుల, వృశ్చికం రాశుల వారికి ఈరోజు మిశ్రమ కాలం నడుస్తోంది.  ఈ రెండు రాశుల వారు చేయని పొరపాటుకు శిక్ష అనుభవిస్తారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2022, 06:46 AM IST
  • March 18 2022 రాశి ఫలాలు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?
  • ఆ రాశుల వారు చేయని పొరపాటుకు శిక్ష అనుభవిస్తారు
Today Horoscope March 18 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు చేయని పొరపాటుకు శిక్ష అనుభవిస్తారు!!

Today Horoscope March 18 2022: మేషం ( Aries): కీలక పనుల్లో బంధు, మిత్రుల సాయం అందుతుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. కుటుంబంతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం మంచిది.

వృషభం (Taurus): మధ్యమ ఫలాలు ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి దగ్గరివారు ముందుకు వస్తారు. విరోధులకు దూరంగా ఉండండి. దుర్గా ఆరాధన ఫలితాన్ని ఇస్తుంది.

మిథునం (Gemini): శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కీలక పనిలో తోటివారి సాయం అందుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ఆదిత్య హృదయం చదవాలి.

కర్కాటకం (Cancer): శుభ ఫలితాలు ఉన్నాయి. మీ పనిలో కుటుంబ సహకారం అందుతుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికా బద్ధంగా పూర్తి చేస్తారు. విరోధులకు దూరంగా ఉండండి. దైవారాధన మానవద్దు.

సింహం (Leo): మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. కీలక సమయంలో సహాయం అందుతుంది. శుభ ఫలితాలను పొందుతారు. ప్రయాణ సూచన ఉంది. శ్రీవిష్ణు దర్శనం ఉత్తమం.

కన్య (Virgo): లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్య వ్యవహారాల్లో ముందుకు సాగాలి. కుటుంబంతో సరదాగా గడుపుతారు. గోసేవ చేయడం ఫలితాలను ఇస్తుంది.

తుల (Libra): చంచల స్వభావం వల్ల ఆటంకాలు పెరుగుతాయి. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. దుర్గారాధన మంచిది.

వృశ్చికం (Scorpio): శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో నిర్ణయాలు మార్చి ఇబ్బందులు పడతారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. చేయని పొరపాటుకు శిక్ష తప్పదు. దైవారాధన మానవద్దు.

ధనస్సు (Sagittarius): ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలు వాయిదా వేయండి. ఇష్టదైవారాధన శుభప్రదం.

మకరం (Capricorn): మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురౌతాయి. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ ఆనందాన్ని పెంచుతుంది. కుటుంబంతో గడుపుతారు. గోసేవ చేయాలి.

కుంభం  (Aquarius): మీ మీ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అనవసర ఆలోచనలను చేయకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. విష్ణు ఆలయ దర్శనం శుభప్రదం.

మీనం (Pisces): ముఖ్య విషయాల్లో మనోనిబ్బరం అవసరం. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీల విషయంలో నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. ప్రయాణ సూచన ఉంది. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.

Also Read: RRR Movie Ticket Price: ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. ఆ సినిమా టికెట్ రేట్స్ పెంపునకు అనుమతి

Also Read: Kane Williamson: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్‌.. కేన్ మామ ఔట్! కెప్టెన్‌గా భువనేశ్వర్‌ కుమార్‌!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News