Horoscope Today June 14th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు తమ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు..

Horoscope Today June 14th 2022: ఈరోజు మంగళవారం.ఇవాళ హనుమంతుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. రాశిచక్రంలో మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల వారికి ఇవాళ ఎదురయ్యే ఫలితాల గురించి జ్యోతిష్కుడు శ్రీనాథ్ ప్రపన్నాచార్య ద్వారా తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 14, 2022, 07:11 AM IST
  • నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ మేష రాశి వారికి ప్రతికూలం
  • మిగతా రాశుల వారికి మిశ్రమ ఫలితాలు
  • పెట్టుబడులకు ఇవాళ శుభదినం
  • ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయంటే..
Horoscope Today June 14th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు తమ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు..

Horoscope Today June 14th 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఇవాళ మేష రాశి వారికి కొంత ప్రతికూలం. మిగతా రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఆర్థికపరంగా అన్ని రాశుల వారికి మంచి ఫలితాలే ఉంటాయి.పెట్టుబడులకు ఇవాళ శుభదినం. ఇవాళ్టి రాశి ఫలాల్లో.. ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇప్పుడు చూద్దాం... 
 
మేషరాశి (Aries)

ఈరోజు ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. బతుకు భారంగా అనిపిస్తుంది. ఆఫీసులో అధికారుల ఆగ్రహానికి గురవుతారు. తల్లిదండ్రుల సహకారంతో ఆర్థికంగా నిలకడగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారులు ఈరోజు సాధారణ లాభాలను పొందుతారు.

వృషభ రాశి (Taurus)

కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. స్నేహితుల సహకారంతో వ్యాపారంలో లాభం ఉంటుంది. విద్యాపరమైన పనుల కోసం ప్రయాణం చేయవలసి రావచ్చు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త ఆందోళన కలిగిస్తుంది.

మిథున రాశి (GEMINI)

ఈ రోజు మీకు సాధారణ రోజు అవుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. విద్యార్థులు తమ కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. మీ జీవిత భాగస్వామితో కలసి సరదాగా గడిపేందుకు ఎక్కడికైనా వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

కర్కాటక రాశి (Cancer) 

ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. రహస్య విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. లేనిపక్షంలో మీకు ద్రోహం తలపెట్టే ప్రమాదం ఉండొచ్చు. విద్యార్థులకు ఈరోజు శుభవార్తలు అందుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు.

సింహ రాశి (LEO)

ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. కార్యాలయంలోని అధికారుల సహాయంతో పదోన్నతి లభిస్తుంది. వ్యాపారంలో విస్తరణకు అనుకూలమైన రోజు. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. లవ్‌మేట్‌తో విభేదాలు రావచ్చు.

కన్య రాశి (Virgo)

మీరు ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. కుటుంబమంతా కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తండ్రి సహకారంతో ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు శుభదినం. ప్రేమ వ్యవహారాలు తీవ్రమవుతాయి.

తులా రాశి (Libra)

కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో ఆశించిన విధంగా లాభం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈరోజు శుభదినం. సాయంత్రం, మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి నైట్ డిన్నర్‌కు వెళ్లే అవకాశం.

వృశ్చిక రాశి (Scorpio)

కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆఫీస్‌లో పనిభారం పెరగడం వల్ల కలత చెందుతారు. ఆరోగ్య సంబంధిత సమస్యలతో సతమతమవుతారు. స్నేహితుల సహకారంతో వ్యాపారంలో లాభం ఉంటుంది. మీ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఇది అనుకూలమైన రోజు.

ధనుస్సు రాశి (Sagittarius)  

ఈ రోజు మీకు సాధారణ రోజు అవుతుంది. ఉద్యోగంలో మార్పు కారణంగా మీరు కలత చెందుతారు. కోపం పనికిరాదు. ఎప్పుడూ సంయమనం పాటించండి, లేకపోతే వివాదాల్లో చిక్కుకుంటారు. వ్యాపారంలో ఆశించిన లాభం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు సవాళ్లను ఎదుర్కోవచ్చు.

మకర రాశి (Capricorn) 

విద్యా విషయాలలో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారంలో సాధారణ లాభం ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభాల వల్ల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.

కుంభ రాశి (Aquarius)

ఈ రోజు మీకు సాధారణ రోజు అవుతుంది. కుటుంబంతో కలిసి షాపింగ్‌కు వెళ్లవచ్చు. ఖర్చులు పెరగడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతారు. వ్యాపారస్తులు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. విద్యా విషయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు కొన్ని శుభవార్తలను అందుకుంటారు.

మీన రాశి (Pisces) 

ఈరోజు ప్రారంభంలో ఆకస్మిక ధనలాభాల కారణంగా ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. విద్యాపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అనుకూలమైన రోజు. వాహన కొనుగోలుసాధ్యమవుతుంది. లవ్‌మేట్‌తో కలిసి ప్రయాణించడానికి ప్లాన్ చేసుకుంటారు.

Also Read: undavalli on CM Kcr: బీజేపీ పాలిట సీఎం కేసీఆర్ సింహా స్వప్నం..ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు..!

 

Also Read: Kajal Aggarwal: మాతృత్వంలో తేలుతున్న కాజల్..తాజాగా మరో ఫోటో వైరల్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News