Horoscope Today June 12th : రాశి ఫలాలు... ఇవాళ ఏయే రాశుల వారికి శుభప్రదం.. ఎవరికి ఏ విషయంలో మంచి జరుగుతుందో తెలుసుకోండి..

Horoscope Today June 12th 2022: ఈరోజు ఆదివారం, ఈ రోజు శ్రావణ నక్షత్రం. చంద్రుడు తులారాశిలో ఉన్నాడు. శని ఈరోజు కుంభరాశిలో ఉన్నాడు. బృహస్పతి మీనరాశిలో ఉన్నాడు. ఈ గ్రహాల స్థితి కారణంగా ఇవాళ ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం...

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 12, 2022, 06:29 AM IST
  • నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారికి శుభవార్తలు అందుతాయి
  • మేష రాశి వారు మానసికంగా ఆందోళన చెందుతారు
  • గ్రహాల స్థితి గతులు రాశులపై ప్రభావం చూపుతాయి
  • నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయంటే..
Horoscope Today June 12th : రాశి ఫలాలు... ఇవాళ ఏయే రాశుల వారికి శుభప్రదం.. ఎవరికి ఏ విషయంలో మంచి జరుగుతుందో తెలుసుకోండి..

Horoscope Today June 12th 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వ్యక్తుల జాతకాన్ని చూసేటప్పుడు గ్రహాలు, నక్షత్ర రాశులతో పాటు పంచాంగ గణన చాలా ముఖ్యమైనది. పంచాంగాన్ని గణించి జాతకం చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఆదివారం, ఈ రోజు శ్రావణ నక్షత్రం. చంద్రుడు తులారాశిలో ఉన్నాడు. శని ఈరోజు కుంభరాశిలో ఉన్నాడు. బృహస్పతి మీనరాశిలో ఉన్నాడు. ఈ గ్రహాల స్థితి ఏయే రాశుల జాతకాన్ని ఎలా ప్రభావితం చేయనుందో తెలుసుకుందాం...

 మేషరాశి ( Aries)

మేష రాశి వారు ఇవాళ మానసికంగా ఆందోళన చెందుతారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. కోపాన్ని నియంత్రించుకోవాలి, లేనిపక్షంలో అది మీ బంధాలపై ప్రభావం చూపవచ్చు. ఇవాళ కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ముఖ్యంగా వ్యాపారంలో ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. ఎరుపు, పసుపు రంగులు శుభప్రదమైనవి. భూమి కొనుగోలుకు కుజుడు అనుకూలం.

వృషభ రాశి (Taurus)

వృషభ రాశి వారికి ఇది ప్రభావవంతమైన రోజు. ఆస్తి తగాదాలు, సమస్యలు పరిష్కరించబడతాయి. విదేశాల నుంచి వ్యాపారం చేసే వ్యక్తులకు శుభవార్తలు అందుతాయి. అది వారి మనస్సును సంతోషపరుస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు లభిస్తాయి. చంద్రుడి అనుగ్రహంతో శుభప్రదంగా ఉంటుంది.

మిథున రాశి (GEMINI)

ఇవాళంతా ఆహ్లాదకరంగా సాగుతుంది. ఇంటికి సంబంధించిన పెట్టుబడులు లాభిస్తాయి. అప్పులన్నీ తీర్చేస్తారు. ఐదవ చంద్రుడు విద్యలో సత్ఫలితాలను ఇస్తాడు. అదృష్ట గృహంలో శని సంచారం కారణంగా, వ్యాపార సంబంధిత నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. జీవిత భాగస్వామి నుంచి అన్నివిధాలా మద్దతు పొందుతారు.

కర్కాటక రాశి (Cancer) 

పెండింగ్‌లో ఉన్న పనులు త్వరగా పూర్తవుతాయి. ఈరోజు విద్యార్థులకు విజయవంతమైన రోజు. అనవసర వివాదాల జోలికి వెళ్లవద్దు. వ్యాపారంలో ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. పసుపు, నారింజ రంగులు శుభప్రదం. విష్ణువును పూజించండి. పెండింగ్‌లో ఉన్న పనులు ఏవైనా పూర్తి చేస్తారు. ఈరోజు పేదలకు మీరు తోచిన సాయం చేయండి.

సింహ రాశి (LEO)

పదో ఇంట్లో సూర్యుని సంచారం ఈరోజు ప్రతి పనిలో విజయాన్ని అందిస్తుంది. వివాహితులైన వారి గృహ జీవితం చాలా బాగుంటుంది. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. అన్ని బంధాల్లో మీరు డామినేట్‌గా ఉంటారు. జీవిత భాగస్వామి పట్ల ప్రేమ పెరుగుతుంది. ఆర్థికంగా కలిసొస్తుంది. బ్యాంకింగ్, ఐటీ రంగాల విద్యార్థులకు ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి.

కన్య రాశి (Virgo)

విద్యా గృహంలో చంద్రుడు, సప్తమ గురువు శుభం. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయినప్పటికీ, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం అలాగే ఉంటుంది. విద్యార్థులు తమ కెరీర్‌లో పురోగతితో సంతోషంగా ఉంటారు. భగవాన్ హనుమంతుడిని ఆరాధిస్తూ ఉండండి. నారింజ, ఆకుపచ్చ రంగులు మీకు శుభప్రదం. నువ్వులు దానం చేస్తే మంచిది.

తులా రాశి (Libra)

ఉద్యోగంలో పురోగతి పట్ల సంతోషం నెలకొంటుంది. గృహ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈ రోజు తమ ప్రియమైనవారి కోపాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. వ్యాపారంలో మీ పనితీరు సంతృప్తినిస్తుంది. ఆరోగ్యం, ఆనందం కోసం హనుమాన్ చాలీసా పఠించండి.

వృశ్చిక రాశి (Scorpio)

చంద్రుడు పన్నెండవ స్థానంలోనూ, శని నాల్గవ స్థానంలోనూ సంచరిస్తున్నాడు. గృహ జీవితానికి ఈరోజు మంచి రోజు అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈ రోజు సంతోషంగా గడుపుతారు. రాజకీయాల్లో ఉన్నవారు విజయం సాధిస్తారు. వైలెట్, స్కై బ్లూ రంగులు శుభప్రదం. వాహనం కొనుగోలు చేసే సూచనలున్నాయి. విష్ణువును పూజిస్తే శుభప్రదం.

ధనుస్సు రాశి (Sagittarius)  

ఈ రోజు చంద్రుడు పదకొండవ ఇంట్లో, సూర్యుడు ఆరవ ఇంట్లో ఉన్నాడు. వివాహితుల గృహ జీవితం ఒత్తిడితో కూడిన పరిస్థితులలో ఉంటుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులకు ఈరోజు తమ ప్రియమైన వారిపై లేని పోని సందేహాలు కలుగుతాయి.చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పని పూర్తవుతుంది. అంతేకాదు, అది మీకు మంచి పేరు, గుర్తింపు తీసుకొస్తుంది.

మకర రాశి (Capricorn) 

చంద్రుడు కర్మ ఇంట్లో ఉన్నాడు. సూర్యుడు ఈ రాశి నుండి ఐదవ స్థానంలో ఉన్నాడు. గృహ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు అందరినీ ప్రేమించే ఆదర్శ స్థితిలో ఉంటారు. అన్నయ్య ఆశీస్సుల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆకుపచ్చ, ఊదా రంగులు శుభప్రదం. పుణ్యక్షేత్రాలు లేదా మతపరమైన స్థలాలను సందర్శిస్తారు.

కుంభ రాశి (Aquarius)

విద్యార్థులు విజయం సాధిస్తారు. జీవితంలో విజయం కోసం హనుమాన్ చాలీసా పఠించండి. వైలెట్, తెలుపు రంగులు శుభప్రదమైనవి. ఆవుకి బెల్లం తినిపిస్తే పుణ్యం కలుగుతుంది. ఉద్యోగ మార్పుకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరగవచ్చు. నువ్వులను దానం చేస్తే మంచిది.

మీన రాశి (Pisces) 

ఈరోజు ద్వాదశ శని, తృతీయ సూర్యుడు, ఈ రాశిలో ఉన్న గురువు కారణంగా ధనలాభం ఉంటుంది. ప్రేమ జీవితంలో ఈరోజు మంచి రోజు. మీ సంబంధంలో శృంగారం పెరుగుతుంది. వివాహితుల గృహ జీవితం సాధారణంగా ఉంటుంది. మీ పిల్లల విజయంతో మీరు సంతోషంగా ఉంటారు. పసుపు, నారింజ రంగులు శుభప్రదం. శ్రీ సూక్తాన్ని పఠించండి.

Also Read: Ravi Shastri on Umran Malik: ఉమ్రాన్ మాలిక్‌ను అప్పుడే ప్రయోగించొద్దు..భారత మాజీ కోచ్ సూచనలు..!

Also Read: Prathyusha Garimella: హైదరాబాద్‌లో ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్ ప్రత్యూష బలవన్మరణం..కారణాలు ఇవేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News