Horoscope Today July 2nd: నేటి రాశి ఫలాలు.. ఈ 4 రాశుల వారికి ఇవాళ బాగా కలిసొస్తుంది..

Horoscope Today July 2nd 2022: ఈరోజు శనివారం. ఈరోజు గ్రహాల గమనంలో పెద్ద మార్పు సంభవించింది. బుధుడు మిథునరాశిలో ప్రవేశించబోతున్నాడు. ఈ ప్రభావం 12 రాశుల వారిపై ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2022, 06:35 AM IST
  • ఇవాళ మేష, ధనుస్సు, కుంభ రాశి, మీన రాశి వారికి మంచి ఫలితాలు
  • వృషభ, కర్కాటక రాశి వారికి ప్రతికూల ఫలితాలు
  • ఇవాళ ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today July 2nd: నేటి రాశి ఫలాలు.. ఈ 4 రాశుల వారికి ఇవాళ బాగా కలిసొస్తుంది..

Horoscope Today July 2nd 2022: ఈరోజు ప్రత్యేకమైన రోజు. బుధ గ్రహం మిథున రాశిలోకి మారబోతున్నాడు. ఈ ప్రభావం రాశిచక్రంలోని 12 రాశుల వారిపై పడుతుంది. ఆయా రాశుల వారికి అది ఎలాంటి ఫలితాలనిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

మేష రాశి (Aries)

ఈ రాశి వారికి అధికారిక పనులు వేగంగా సాగుతాయి. సమయం అనుకూలిస్తుంది. అధికారుల వద్ద మంచి పేరు తెచ్చుకుంటారు. ఈ రోజు వ్యాపారులకు లాభదాయకమైన రోజు, మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే.. ఆ దిశగా ప్రయత్నాలు చేయవచ్చు. యువత ఎక్కడైనా ఆలోచనాత్మకంగా మాట్లాడాలని, లేకుంటే ప్రజల్లో నవ్వులపాలవుతారని గుర్తుంచుకోండి. కుటుంబ కలహాలతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగదు, చాలా ఆలోచించి ఓపికతో నిర్ణయం తీసుకోండి.గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. నిర్ణీత వ్యవధిలో వైద్యుల సలహాలను తీసుకుంటూ ఉండాలి. ఇతరులతో చాలా కఠినమైన, పదునైన స్వభావం మంచిది కాదు.

వృషభ రాశి (Taurus)

ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న రాశి వారికి ఈరోజు ఇబ్బందులు ఎదురుకావొచ్చు, ఓపికతో పని చేయండి. వ్యాపారవేత్తలు కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అనుకూల సమయం. యువత సృజనాత్మక పనిలో రాణిస్తారు. దీని కోసం మీరు సృజనాత్మక స్నేహితులతో మరింత సన్నిహితంగా ఉండటం ముఖ్యం. పౌష్టికాహారం తీసుకోవాలి.. లేనిపక్షంలో ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఎలాంటి రుగ్మతలు ఉండవు. అయినప్పటికీ ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి.

మిథున రాశి (GEMINI)

ఉద్యోగ లేదా వ్యాపార పని నిమిత్తం అధికారిక ప్రయాణాలు చేస్తారు. రవాణా పనులు చేసే వారు ఈరోజు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. యువత అనుభవం లేని పనులు చేపట్టకూడదు. వివాహితులు తమ జీవిత భాగస్వామితో కొంత సమయాన్ని గడుపుతారు, జీవిత భాగస్వామి కూడా అదే ఆశిస్తారు. బయటి తిండి మంచిది కాదు. అజీర్ణం, వాంతులు మొదలైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు నడిపే వాహనం ఎప్పుడూ ఫిట్‌గా ఉండేలా చూసుకోండి.

కర్కాటక రాశి (Cancer) 

కర్కాటక రాశి వారు ఉద్యోగం గురించి ఆందోళన చెందుతారు. వ్యాపార శత్రుత్వం ఉన్నవారు ప్రత్యర్థులకు దూరంగా ఉండండి. మిమ్మల్ని ఇరికించడానికి ఏదైనా కుట్ర పన్నవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ప్లేస్‌మెంట్‌ అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఉండొచ్చు. మీ స్వభావంలో వినయం, సౌమ్యత ముఖ్యం. మీ పనిపై దృష్టి పెట్టండి. తప్పక విజయం సాధిస్తారు.

సింహ రాశి (LEO)

ఈ రాశికి చెందిన వారు ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌లో కొత్తగా చేరినట్లయితే, ఆత్మన్యూనతకు లోను కావొద్దు. పూర్తి విశ్వాసంతో పని చేయండి. అది కర్మాగారం అయినా లేదా దుకాణం అయినా, అక్కడ అగ్నిప్రమాదానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పటిష్టంగా, సరిగ్గా ఉంచండి. లేనిపక్షంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. యువతకు ఈ రోజు చాలా మంచి రోజు. అనుకున్న పనులు చకచకా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం ఆకస్మికంగా క్షీణించే అవకాశం ఉంది, కాబట్టి మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ప్రియమైనవారి నుంచి కఠినమైన మాటలు బాధిస్తాయి.

కన్య రాశి (Virgo)

కన్యా రాశి వారికి ఆఫీసులో బాస్ నుంచి కొంత భయం పొంచి ఉంటుంది, ఈ పరిస్థితిని నివారించాలి. ఎందుకంటే బాస్‌తో వివాదం మంచిది కాదు. వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తి నాణ్యత గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే నాణ్యత ఉన్నప్పుడే కస్టమర్ మీ వద్దకు తిరిగి వస్తారు. యువత తమ లక్ష్యం వైపు దృష్టి సారించి లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా పని చేయాలి. ఈరోజు మీరు మీ నాన్నగారి సాంగత్యంలో ఆయన బాగోగులు చూసుకుంటూ సేవ చేయాలి. ఆయన ఆశీస్సులు మీకు చాలా ముఖ్యం.తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు మొబైల్ చూస్తూ, ల్యాప్‌టాప్ లేదా టీవీ ముందు కూర్చోవద్దు. శత్రువులను విస్మరించవద్దు, వారి కార్యకలాపాలపై నిఘా ఉంచండి. వారు కుట్రలకు తెరలేపవచ్చు.

తులా రాశి (Libra)

ఈ రాశి వారు ఉద్యోగస్తులతో సామరస్యంగా నడుచుకోవాల్సి ఉంటుంది. మీ నుంచి అప్పుగా తీసుకున్న డబ్బు ఆలస్యంగా వసూలవుతుంది. యువత కెరీర్ గురించి ఆందోళన చెందుతారు, కలత చెందడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇంటి పెద్ద తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఏదైనా సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వ్యక్తులు అజాగ్రత్తగా ఉండకూడదు, ఈ నిర్లక్ష్యం హాని కలిగిస్తుంది. ఈ రోజు మీరు ఏదైనా మతపరమైన కార్యక్రమంలో భాగం కావాలి, మీరు సమీపంలోని ఆలయంలో ఆరతిలో పాల్గొనవచ్చు.

వృశ్చిక రాశి (Scorpio)

వృశ్చిక రాశి వ్యక్తులు బహుళ పనులు చేయవలసి ఉంటుంది. అప్పుడే పనులు పూర్తవుతాయి. అనుభవజ్ఞుడైన వ్యక్తిని మీ వ్యాపారంలో చేర్చుకోండి, అతని అనుభవం మీ వ్యాపారాన్ని పెంచడంలో సహాయపడుతుంది. యువత సమయాన్ని వృథా చేసుకోకుండా, లక్ష్యాన్ని సాధించేందుకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. కుటుంబంలో ప్రియమైనవారి మధ్య గొడవలు ఉండవచ్చు, చిన్న విషయాలను పట్టించుకోకుండా ఉండటం మంచిది.ఆరోగ్యం కాపాడుకోవాలంటే డాక్టర్ చెప్పిన డైట్ కచ్చితంగా పాటించండి.

ధనుస్సు రాశి (Sagittarius)  

ఈ రాశికి చెందిన వ్యక్తులు కచ్చితంగా పనిలో విజయం సాధిస్తారు, పూర్తిగా కష్టపడి పని చేయండి. ఫర్నిచర్ వ్యాపారులు ఈరోజు మంచి లాభాలు పొందగలరు, వారు తమ కస్టమర్లతో ప్రేమగా మాట్లాడాలి. మంచి సాంగత్యం యువతను సరైన దారిలో తీసుకెళ్తుంది కాబట్టి ఏదైనా చెడు సహవాసం ఉంటే దానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇవాళ మీ ఇంటికి ఒక అనుకోని అతిథి వస్తాడు. అతనికి అతిథి మర్యాదలు తక్కు చేయొద్దు. ఆర్థరైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నవారికి కాస్త ఉపశమనం లభిస్తుంది. ప్రయాణ సమయంలో మీ లగేజీని నిశితంగా గమనించండి, దొంగతనం జరిగే అవకాశం ఉంది.

మకర రాశి (Capricorn) 

మకర రాశి వారు పదోన్నతితో పాటు బదిలీలకు సిద్ధంగా ఉండాలి, కొత్త బాధ్యతలు వస్తాయి, వాటిని నెరవేర్చడానికి ప్రణాళిక వేసుకోలి. మీరు ఆదాయ కొరతను ఎదుర్కొంటున్నట్లయితే వ్యాపారాన్ని విస్తరించండి, అప్పుడే ఆదాయం పెరుగుతుంది. యువత విజ్ఞానాన్ని పెంచుకునే సమయం, మీకు ఎక్కడ అవకాశం దొరికినా ఉపయోగించుకోండి. ఇదే మీ భవిష్యత్తుకు కీలకం.ఈ రోజు మీ జీవితంలో ముఖ్యమైన రోజు అయితే, మీ ప్రియమైనవారితో సెలబ్రేట్ చేసుకోవాలి. ఏదైనా సమస్య కారణంగా మీకు ఆపరేషన్ జరిగితే డాక్టర్ సూచనలను అనుసరించండి. 

కుంభ రాశి (Aquarius)

ఈ రాశి వారికి విదేశీ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. వ్యాపార విషయాలలో ఎక్కువ రిస్క్ తీసుకోవడం మంచిది కాదు, మీరు భరించగలిగినంత మాత్రమే రిస్క్ తీసుకోండి. యువకులు తమ స్నేహితులతో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించాలి, ఎందుకంటే స్నేహితులు ఆనందమే కాదు దుఃఖాన్ని పంచుకుంటారు.పిల్లలు, యుక్తవయస్కులు వారి ఆలోచనలను వారి తల్లిదండ్రులతో పంచుకోవాలి. వారి నుంచి సలహాలు తీసుకోవాలి. పాత వ్యాధులు తిరగబెడుతాయి. బంధువులతో సంబంధాలు బలోపేతం అవుతాయి, .

మీన రాశి (Pisces) 

మీన రాశి వారికి మంచి కెరీర్ అవకాశాలు ఉంటాయి, ఈ అవకాశాలలో ఉత్తమమైన వాటిని ఎంచుకోండి. ఫైనాన్స్‌కు సంబంధించిన వ్యాపారంలో లాభపడే పరిస్థితి ఉంది, ఈ వ్యాపారం చేసే వ్యక్తులు లాభంపై దృష్టి పెట్టాలి. ఈరోజు యువతకు పూర్తి వినోదం ఉంటుంది, జీవితంలో కొన్నిసార్లు వినోదం కూడా అవసరం. కుటుంబంలో తోబుట్టువులతో సంబంధాలు బలంగా ఉంటాయి, అందరి మధ్య మంచి సామరస్యం ఏర్పడుతుంది.చర్మానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తుకు ఉపయోగపడే కొన్ని కొత్త కోర్సులను స్నేహితులతో కలిసి చేయాలనే ఆలోచన ఉంటుంది.

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)

Also Read: Cheteshwar Pujara Record: చతేశ్వర్ పుజారా చెత్త రికార్డు.. ఏకంగా 12 సార్లు..!

Also Read: Pavitra Lokesh: నరేష్ తో బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాలా?.. ప్లీజ్ సపోర్ట్ చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News