Horoscope Today Feb 4 2022: మనం ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు ఈ రోజు దినఫలాలు ఎలా ఉన్నాయోనని చూస్తాం. మరి నేటి రాశిఫలాలు (Horoscope Today) ఎలా ఉన్నాయంటే...
మేషం (Aries): ఈ రాశివారు పట్టుదలతో ప్రయత్నిస్తే అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.
వృషభం ( Taurus): ఈ రోజు ఈ రాశివారికి శ్రమ అధికమవుతోంది. చేపట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో గొడవలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి.
మిథునం (Gemini) : ఈ రాశివారికి శుభకాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా లాభపడతారు. ఆత్మీయులు, కుటుంబసభ్యులతో కలిసి విందూవినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం ( Cancer) : ఈ రాశి వారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. చేపట్టిన పనులు కొంచెం ఆలస్యమైనా సకాలంలో పూర్తవుతాయి. పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి.
Also Read: Vastu tips for Money: ఇంట్లో డబ్బును ఈ స్థలంలో భద్రపరిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుందట..
సింహం (Leo) : వీరు సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రుల సహకారంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.
కన్య (Virgo): ఈ రోజు ఈ రాశివారు శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలు కలిసివస్తాయి. సమయానుకూలంగా పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
తుల (Libra): వీరు ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కీలక నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి.
వృశ్చికం (Scorpio): ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. సమయానుకూలంగా స్పందించడం మంచిది. కుటుంబసభ్యులు, సన్నిహితులకు గొడవలకు దూరంగా ఉండాలి.
ధనుస్సు (Sagittarius): వీరికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా...ప్రయత్నం చేసి విజయం సాధిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. కొన్ని పరిస్థితులు మనోవేదనకు గురిచేస్తాయి.
మకరం (Capricorn): ఈ రాశివారు మనోబలం తగ్గకుండా ధైర్యంతో ముందడుగు వేస్తే పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు వీరికి కనువిప్పు కలిగిస్తాయి.
కుంభం (Aquarius): ఈ రాశి వారికి శుభకాలం. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. విందూ వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు సఫలం అవుతాయి.
మీనం (Pisces): వీరు మానసిక ప్రశాంతత కోసం శ్రమించాల్సి ఉంటుంది. చిత్తశుద్దితో సకాలంలో పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook