Horoscope Today Feb 22 2022: నేటి రాశి ఫలాలు.. సడెన్ ఆఫర్‌తో ఆ రాశివారు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్

Horoscope Today  Feb 22 2022:  నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2022, 07:40 AM IST
  • నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఇవాళ ఉద్యోగ ప్రమోషన్
  • సడెన్ ఆఫర్‌తో ఆ రాశి వారు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్
  • ప్రేమ వ్యవహారాల్లో ఆచీ తూచీ నిర్ణయాలు అవసరం
 Horoscope Today Feb 22 2022: నేటి రాశి ఫలాలు.. సడెన్ ఆఫర్‌తో ఆ రాశివారు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్

Horoscope Today Feb 22 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారికి ఇవాళ ఉద్యోగపరంగా ప్రమోషన్ లేదా బోనస్ అందే అవకాశం ఉంది. కొన్ని రాశుల వారికి కొత్త స్నేహాలు, పరిచయాలు జరగవచ్చు. ప్రేమ పెళ్లికి సంబంధించిన వ్యవహారాల్లో ఆచీ తూచీ వ్యవహరించాల్సి ఉంటుంది. 

మేషరాశి ( Aries) 

మీపై బలమైన ముద్ర వేసిన వ్యక్తిని ఇవాళ కలుస్తారు. ఆ వ్యక్తిని మీ మది నుంచి తొలగించడం అంత సులువు కాదు. మీ తోబుట్టువు ఒకరు మీ పనుల్లో సహాయ సహకారాలు అందిస్తారు. అనుకోని ప్రయాణం మిమ్మల్ని ఇబ్బందిపెడుతుంది. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి.

వృషభ రాశి (Taurus)

పెండింగ్ పనులు పూర్తి చేయండి. మీ బాస్ చాలా కఠినాత్ముడు కావడం వల్ల ఆఫీసులో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ ఆయనతో గొడవపడవద్దు. వీలైతే కుటుంబం లేదా మీ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసుకోండి. తద్వారా మానసిక, శారీరక ప్రశాంతత చేకూరుతుంది.

మిథున రాశి (GEMINI)

కొన్ని రిస్క్ పనులు చేసేందుకు వెనుకాడరు. అందులో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే ఇవాళ మీరు తలపెట్టే పనుల్లో మీకు హాని కలిగించేది ఏది ఉండదు. ఆత్మవిశ్వాసం, సంకల్పంతో ముందుకు సాగితే అన్నింటా మంచి ఫలితాలు పొందుతారు. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది.

కర్కాటక రాశి (Cancer) 

మీ రెగ్యులర్ వర్క్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని కుటుంబంతో లేదా భార్యతో గడపండి. వీలైతే అంతా కలిసి ఎక్కడికైనా టూర్‌కి వెళ్లడం మీకు నూతనోత్సాహాన్ని కలిగిస్తుంది. మీ ప్రేమ జీవితం వికసిస్తుంది. ప్రేమ పెళ్లికి సంబంధించిన విషయాల్లో ఆచీ తూచీ వ్యవహరించండి. వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

సింహ రాశి (LEO)

మీ ప్రియమైన వ్యక్తులతో క్వాలిటీ సమయం గడుపుతారు. కొత్త స్నేహాలు, పరిచయాలకు అవకాశం ఉంటుంది. పూర్తి చేయాల్సిన పనులు వాయిదా వేయకండి. పనులు పక్కనపెట్టి గాసిప్స్ లేదా కబుర్లలో మునగవద్దు. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో పెద్దల సలహాలు, సూచనలు స్వీకరించండి. 

కన్య రాశి (Virgo)

మీ నిర్ణయాలను స్వేచ్చగా వ్యక్తీకరిస్తారు. ఇమేజినేషన్, ఇన్నోవేషన్, మోటివేషన్.. ఈ మూడింటితో ముందుకు సాగండి. అతిగా మద్యం సేవించడం లేదా అతిగా తినడం మానేయండి. మీ ఇంట్లోని పిల్లలతో ఎక్కువ సమయం గడపండి. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వండి

తులా రాశి (Libra)

ఇవాళ మీరు చాలా యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా పనులు పూర్తి చేసే విషయంలో ముందుంటారు. మీ ఆలోచనలు ఉన్నత స్థాయిలో ఉంటాయి. ఇతరులను సైతం మీరు ఇన్‌స్పైర్ చేయగలరు. ఆత్మన్యూనత భావం మీ దరిచేరదు. మీ శత్రువులు ప్రస్తుతానికి మీ జోలికి వచ్చే సాహసం చేయరు.

వృశ్చిక రాశి (Scorpio)

కొత్త ఉద్యోగం లేదా ఇల్లు విషయంలో సంకోచిస్తారు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒకవేళ దాన్ని సద్వినియోగపరుచుకోలేకపోతే విచారించక తప్పదు. క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. 

ధనుస్సు రాశి (Sagittarius)  

పని ఒత్తిడి పెరుగుతుంది. ఎక్కువ సమయం కష్టపడుతారు. దీంతో నీరసం ఆవహిస్తుంది. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు అనవసరంగా మాటలు తూలవద్దు. ఉద్యోగపరంగా మాత్రం మీ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు ఎదుటివారికి స్పష్టంగా తెలియజేయండి.

మకర రాశి (Capricorn) 

ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారికి కలిసొస్తుంది. మీరు చేస్తున్న పనికి మంచి గుర్తింపు, గౌరవం దొరుకుతాయి. కొన్ని సందర్భాల్లో కొత్త సవాళ్లు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసినా వెనక్కి తగ్గవద్దు. కుటుంబ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం.

కుంభ రాశి (Aquarius)

ఇవాళ ఆకస్మిక ప్రయాణానికి ఛాన్స్. ఆ ప్రయాణం కొత్త బిజినెస్ వెంచర్స్‌కి దారితీయవచ్చు. మీ పిల్లలు మీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటారు. అకస్మాత్తుగా వచ్చిన ఓ ఆఫర్ మిమ్మల్ని గందరగోళంలోకి నెట్టుతుంది. అయితే దీర్ఘకాలంలో అది మీకు మంచి ప్రయోజనాలను అందిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. 

మీన రాశి (Pisces) 

మీ భాగస్వామితో మీ భవిష్యత్తు గురించి చర్చించండి. ఆర్థిక ఇబ్బందులపై ఇద్దరు మాట్లాడుకోండి. మిత్రులు, సన్నిహితుల నుంచి తగిన సహకారం లభిస్తుంది. మీ కృషికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బోనస్ అందే ఛాన్స్. వృత్తిపరంగా మీ పోటీదారుల కన్నా ముందుంటారు. 

Also Read: Bheemla Nayak Trailer: భీమ్లా నాయక్ ట్రైలర్.. పవర్ ప్యాక్డ్... ఫ్యాన్స్‌కు పూనకాలే..

Bheemla Nayak: ట్రైలర్ గంట ఆలస్యం... భీమ్లా నాయక్ టీమ్ ను ఏకిపారేసిన ఫ్యాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News